హరీష్ రావు ఫై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

సిద్ధిపేట ఎమ్మెల్యే , మాజీ మంత్రి హరీష్ రావు ఫై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. రుణమాఫీ విషయంలో హరీశ్ సవాల్ చేసి, రాజీనామా చేయకుండా పారిపోయారన్నారు. ఆయన దొంగ అని తనకు ముందే తెలుసన్నారు. ఇప్పటికే తమ ప్రభుత్వం రూ.17,933 కోట్ల రుణమాఫీ చేసిందని సీఎం తెలిపారు. త్వరలోనే అందరికీ రుణమాఫీ అవుతుందన్నారు. హరీశ్, కేటీఆర్ ప్రతి రైతు దగ్గరికి వెళ్లాలని, రుణమాఫీ కాని రైతుల వివరాలు సేకరించి కలెక్టరేట్లో ఇవ్వాలని సూచించారు.