బంగారం తాకట్టుపెట్టి రుణాలు తీసుకునే మాఫీ లేదు – సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy

రేవంత్ సర్కార్ 2 లక్షల రుణమాఫీ ఎప్పుడు చేస్తుందా అని తెలంగాణ రైతులంతా ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని చెపుతూ వస్తున్న సీఎం…ఇప్పటికే దీనికి సంబదించిన మార్గదర్శలు కూడా విడుదల చేసారు. తాజాగా సీఎం రేవంత్​ రెడ్డి మాట్లాడుతూ.. ఒక్కో కుటుంబానికి గరిష్ఠంగా 2 లక్షల రూపాయల వరకూ రుణమాఫీ అమలు చేస్తామని చెప్పారు.

ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను మూడు, నాలుగు రోజుల్లో ప్రకటిస్తాని అన్నారు. అయితే.. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ మార్గదర్శకాలను అనుసరించి తీసుకున్న పంట రుణాలు మాత్రమే మాఫీ చేస్తామని స్పష్టం చేశారు. బంగారం తాకట్టుపెట్టి తీసుకున్న రుణాలు మాఫీ చేయబోమని తేల్చి చెప్పారు. ఈ నిర్ణయం ఫై పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బంగారం పెట్టి ఋణం తీసుకున్నవారికి మాఫీ లేదని చెప్పడం తగదని అంటున్నారు.