హెడ్రా కూల్చివేతలపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

గత పది రోజులుగా హెడ్రా పేరు మారుమోగిపోతుంది. హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాల ఫై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. రాజకీయ నేతలు , సినీ ప్రముఖులు , బిజినెస్ నేతలు ఇలా ఎవర్ని వదిలిపెట్టకుండా హైడ్రా కూల్చివేతలు చేస్తూ వస్తుంది. ఈ క్రమంలో హైడ్రా తీరుపై సీఎం కీలక వ్యాఖ్యలు చేసారు. సచివాలయంలో మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ లో మాట్లాడుతూ.. ‘హైడ్రా కూల్చివేతలపై ఒత్తిళ్లు భారీగానే వస్తున్నాయి. అయినా వాటిని ఎదుర్కొంటాం.

అంతే తప్ప వెనక్కి తగ్గేది లేదు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో ఎవరు నిర్మాణాలు చేసినా కూడా వాటిని కూల్చివేస్తాం. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నా కుటుంబ సభ్యులు లేదా బంధువులెవరైనా కబ్జా చేసినట్లు కేటీఆర్ చూపిస్తే వాటిని నేనే దగ్గరుండి కూల్చివేయిస్తాను. అంతెందుకు సీడబ్ల్యూసీ సభ్యుడు పల్లంరాజు నిర్మాణాన్నే హైడ్రా మొదటగా కూల్చివేసింది. జన్వాడ ఫామ్ హౌస్ లీజుకు తీసుకున్నట్లు అఫిడవిట్ లో కేటీఆర్ ఎందుకు పేర్కొనలేదు. నిర్మాణాలకు సర్పంచ్ లు కాదు.. అధికారులే అనుమతి ఇస్తారని కేటీఆర్ కు తెలవదా..? పదేళ్లు మంత్రిగా పనిచేసిన కేటీఆర్ కు ఈ విషయం కూడా తెలియదా? అని ప్రశ్నించారు.

విద్యా సంస్థల ముసుగులో కబ్జా చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. ఇప్పటివరకైతే హైడ్రా హైదరాబాద్ కు మాత్రమే పరిమితం. బఫర్ జోన్, ఎఫ్టీఎల్, చెరువులు, నాలాల ఆక్రణల తొలగింపునకే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నాం. 30 ఏళ్ల కింద కట్టిన అక్రమ నిర్మాణాలైనా వాటిపై హైడ్రా చర్యలు తీసుకుంటది. బీఆర్ఎస్ నేత, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు సిద్ధమైతే ఆయన నేతృత్వంలోనే చెరువుల ఆక్రమణలపై నిజ నిర్ధారణ కమిటీ వేద్దాం’ అంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.