5 లక్షలతో పట్టుబడిన..సీఎం కార్యాలయ ఉద్యోగులు..ఢిల్లీ

5 లక్షలతో పట్టుబడిన..సీఎం కార్యాలయ ఉద్యోగులు..ఢిల్లీ

ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది ముఖ్యమంత్రి కార్యాలయానికి చెందిన ఇద్దరు ఉద్యోగులు రూ. 5 లక్షల నగదుతో పట్టుబడ్డారు ఫ్లయింగ్ స్క్వాడ్ టీం (ఎఫ్ఎస్‌టీ) పక్కా సమాచారంతో వారిని అదుపులోకి తీసుకుంది. పోలింగ్ ప్రారంభమయ్యే ముందు ఈ ఘటన జరిగినట్టు సమాచారం. నిందితులు గౌరవ్, అజిత్‌గా గుర్తించారు.పోలీసులు ఆ రెండూ ఉద్యోగుల నుంచి రూ. 5 లక్షలు స్వాధీనం చేసుకున్నారని, దర్యాప్తు కొనసాగుతోందని ప్రకటించారు. వారి దగ్గర ఆ డబ్బు ఎలా వచ్చిందో, ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నారో తెలుసుకునేందుకు పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

5 లక్షలతో పట్టుబడిన..సీఎం కార్యాలయ ఉద్యోగులు..ఢిల్లీ
5 లక్షలతో పట్టుబడిన..సీఎం కార్యాలయ ఉద్యోగులు..ఢిల్లీ

ఈ ఇద్దరు ఉద్యోగుల్లో ఒకరు ముఖ్యమంత్రి పీఏకి అసిస్టెంట్‌గా మరొకరు డ్రైవర్‌గా పని చేస్తున్నారు.ఇక ఢిల్లీలో ఈ ఉదయం 70 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది.1.5 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 699 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అధికార ఆప్ (ఆమ్ ఆద్మీ పార్టీ) మూడోసారి అధికారం సాధించాలని చూస్తుండగా, బీజేపీ 20 సంవత్సరాల తర్వాత ఢిల్లీ పీఠాన్ని తిరిగి సాధించేందుకు పోటీలో ఉంది. అలాగే, 2013 వరకు 15 ఏళ్లపాటు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్ పార్టీ గత రెండు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఈ ఎన్నికల్లో కనీసం పరువు కాపాడుకోవాలని కాంగ్రెస్ ఆశిస్తోంది.ఈ ఎన్నికల ఫలితాలు ఢిల్లీ రాజకీయాలపై కీలక ప్రభావాన్ని చూపిస్తాయి. ఆప్ మూడోసారి అధికారం సాధిస్తుందా, బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందా, లేక కాంగ్రెస్ పునరుద్ధరించుకుంటుందా అన్నది ఈ ఎన్నికల మీద ఆధారపడి ఉంటుంది.

Related Posts
సంక్రాంతి కానుకగా ప్రత్యేక రైళ్లు!
సంక్రాంతి కానుకగా ప్రత్యేక రైళ్లు!

సంక్రాంతి పండుగకు దక్షిణ మధ్య రైల్వే 52 ప్రత్యేక రైళ్లను ప్రారంభించింది. ఈ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్, కాచిగూడ, చెర్లపల్లి స్టేషన్ల నుండి కాకినాడ, నరసాపూర్, తిరుపతి, Read more

బంగ్లాదేశ్-పాక్ సాన్నిహిత్యం
బంగ్లాదేశ్-పాక్ సాన్నిహిత్యం

భారతదేశానికీ కొత్త సవాళ్లు: బంగ్లాదేశ్-పాక్ సాన్నిహిత్యం బంగ్లాదేశ్-పాక్ సాన్నిహిత్యం భారతదేశానికి పెద్ద చర్చనీయాంశమైంది. 1971 భారత-పాక్ యుద్ధం తర్వాత పాకిస్తాన్ సైన్యానికి మరోసారి బంగ్లాదేశ్‌లో అడుగు పెట్టే Read more

నేడు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం
Special meeting of Telangana Assembly today

హైదరాబాద్‌: ఈరోజు (మంగళవారం) ఉదయం 10 గంటలకు క్యాబినెట్ సమావేశం జరుగుతుంది. అందులో.. కులగణన సర్వే రిపోర్టును ఆమోదిస్తారు. అలాగే.. ఎస్సీ ఉప కులాల వర్గీకరణపై డాక్టర్ Read more

రేపు దావోస్ పర్యటనకు సీఎం రేవంత్..!

హైదరాబాద్‌: ఈ నెల 16న అంటే రేపు దావోస్ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారట. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. పీఆర్ టీమ్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *