New law in AP soon: CM Chandrababu

జనవరిలో దావోస్‌కు వెళ్లనున్న సీఎం చంద్రబాబు

అమరావతి: సీఎం చంద్రబాబు వచ్చే ఏడాది జనవరిలో స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో పర్యటించనున్నారు. అక్కడ జనవరి 20 నుంచి 24వ తేదీ వరకు జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఆయనతోపాటు మంత్రులు, అధికారులు పాల్గొంటారు. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది. సీఎం పర్యటనకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు చేసేందుకు అధికారుల బృందం నిన్న దావోస్‌కు పయనమైంది. ఏపీ నుంచి వెళ్లిన ఈ ముగ్గురు అధికారుల బృందం ఈ నెల 22 వరకు దావోస్‌లో ఉంటుంది.

దావోస్‌ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు ఆంధ్రప్రదేశ్‌ పెవిలియన్‌ ఏర్పాటు, సమావేశాల నిర్వహణకు అవసరమైన ప్రదేశాలను ఈ అధికారుల బృందం ఎంపిక చేస్తుంది. డబ్ల్యూఈఎఫ్‌ సదస్సు సమయంలో అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులకు అవసరమైన సహకారం, ఏర్పాట్లపై దావోస్‌ కౌన్సిల్‌ ప్రతినిధులతో అధికారుల బృందం చర్చిస్తుంది. వచ్చే ఏడాది దావోస్‌లో జరిగే డబ్ల్యూఈఎఫ్‌ సమావేశాలను ‘షేపింగ్‌ ద ఇంటెలిజెంట్‌ ఏజ్‌’ అన్న థీమ్‌తో నిర్వహిస్తున్నారు.

కాగా, ఈ దావోస్ సదస్సుకు ప్రపంచం నలుమూలల నుంచి వివిధ దేశాధినేతలు, ప్రముఖ పారిశ్రామిక, వాణిజ్యవేత్తలు హాజరవుతారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో దావోస్‌ సదస్సుకు రాష్ట్రం నుంచి ప్రతినిధుల బృందం కచ్చితంగా హాజరయ్యేది. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు లీడ్ చేసేవారు.. పారిశ్రామికవేత్తలతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. ఆ ఐదేళ్లలో దావోస్‌ వేదికగా ఆంధ్రప్రదేశ్‌లో రూ.వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. అనంతరం పలు కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి.

Related Posts
పుష్ప 2′ సీన్‌పై తీన్మార్ మల్లన్న ఫిర్యాదు
img1

'పుష్ప 2' సీన్‌పై తీన్మార్ మల్లన్న ఫిర్యాదు: మరింత చిక్కుల్లో పడ్డా అల్లు అర్జున్ "పుష్ప 2" చిత్రానికి సంబంధించిన ఓ సీన్‌పై ప్రముఖ యూట్యూబర్ మరియు Read more

పద్మ అవార్డుల ప్రకటన పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి
padma awards 2025

https://epaper.vaartha.com/గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం జనవరి 25న మొత్తం 139 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ అవార్డుల్లో తెలంగాణకు కనీసం Read more

ఈనెల 14 నుంచి ‘పల్లె పండుగ’ – పవన్ కళ్యాణ్
Laddu controversy. Pawan Kalyan to Tirumala today

ఈనెల 14 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 'పల్లె పండుగ' కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. గ్రామ సభల్లో ఆమోదించిన పనులను పల్లె పండుగ సందర్భంగా Read more

ఫూలే స్ఫూర్తిని అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుంది – సీఎం చంద్రబాబు
Mahatma Jyotirao Phules de

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పించారు. ఫూలే తన జీవితాన్ని సామాజిక సమానత్వం సాధించడంలో, బడుగు, Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *