Untitled 1CM Chandrababu visit to West Godavari district today

నేడు పశ్చిమ గోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటన

అమరావతి: సీఎం చంద్రబాబు నేడు పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు దంపతులు వాసవీ మాత ఆలయాన్ని సందర్శించనున్నారు. అనంతరం వాసవీ కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవంలో పాల్గొననున్నారు. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ రోజును పురస్కరించుకుని ఇక్కడ ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆపై రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.

ఈ నేపథ్యంలో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. విద్యుత్‌ దీప కాంతులతో మెరిసిపోతోంది. సీఎం పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వివిధ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రెండు రోజులుగా కలెక్టర్‌ నాగరాణి, ఎస్పీ నయీమ్‌ అస్మి, ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, దేవస్థానం అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో కన్యకా పరమేశ్వరి, వాసవి ధామ్‌ ఆలయాల వద్ద ఏర్పాట్లు చేశారు.

image

ఇక రేపు అన్నమయ్య జిల్లాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్లానున్నారు. రాయచోటి నియోజకవర్గంలోని సంబేపల్లి మండలంలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు. ఫిబ్రవరి 1న అంటే రేపు సంబేపల్లిలో జరిగే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పెన్షన్లను సీఎం చంద్రబాబు పంపిణీ చేయనున్నారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో కడపకు చేరుకోనున్నారు.

కడప ఎయిర్ పోర్ట్ నుండి హెలికాప్టర్ లో సంబేపల్లి మండలం పిఎన్ కాలనీ వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు చేరుకోనున్న సీఎం చంద్రబాబు నాయుడు… హెలిపాడ్ నుండి కాన్వాయ్ ద్వారా సంబేపల్లి చేరుకొని ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేయనున్నారు. అనంతరం లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్లను సీఎం చంద్రబాబు నాయుడు పంపిణీ చేయనున్నారు.

Related Posts
స్వీడన్, నార్వే యుద్ధానికి సిద్ధం: ఉక్రెయిన్-రష్యా సంక్షోభం ఎలా మారిపోతుంది?
NATO

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరియు యుకె ప్రధాని కీర్ స్టార్మర్ ఉక్రెయిన్‌ను శక్తివంతమైన ఆయుధాలతో సన్నద్ధం చేసేందుకు ATACMS మరియు స్టార్మ్ షాడో ఆయుధ వ్యవస్థలను Read more

భక్తులు ప్రాణాలు కోల్పోవడం విచారకరం: జగన్‌
It is sad that devotees lost their lives.. Jagan

అమరావతి: తిరుమల వేంకటేశ్వరస్వామి వైకుంఠ దర్శనం కోసం తిరుపతిలో టోకెన్లు జారీచేస్తున్న కేంద్రం వద్ద తొక్కిసలాటలో భక్తులు మరణించడంపై వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి Read more

ట్రంప్ సంచలన హామీలు
ట్రంప్ సంచలన హామీలు

డొనాల్డ్ ట్రంప్‌ అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు ప్రసంగంలో మూడో ప్రపంచ యుద్ధాన్ని అడ్డుకుంటానని, దేశ సరిహద్దులపై జరుగుతున్న దండయాత్రను ఆపుతానని హామీ Read more

ఢిల్లీ సెక్రటేరియట్‌ను సీజ్ చేసిన అధికారులు
Officials who besieged the Delhi Secretariat

న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఎన్నికల ఫలితాలు రాగానే కీలక ఆదేశాలు జారీ చేశారు. సెక్రటేరియట్ నుంచి ఒక్క ఫైల్ కూడాబయటకు వెళ్లకుండా చూడాలన్నారు. ఈ మేరకు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *