ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ ఢిల్లీ పర్యటనలో భాగంగా మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, టెక్ దిగ్గజం బిల్ గేట్స్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశాన్ని గురించి చంద్రబాబు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
బిల్ గేట్స్ తో చర్చ
ఈ భేటీలో ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, ఉపాధి వంటి కీలక రంగాల్లో ఆధునిక సాంకేతికతల వినియోగంపై ప్రధానంగా చర్చించామని చంద్రబాబు చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ( ఏఐ), ప్రెడిక్టివ్ ఎనలిటిక్స్ వంటి టెక్నాలజీల ద్వారా రాష్ట్ర ప్రగతికి కొత్త దిశ చూపేఆధునిక సాంకేతికతల వినియోగానికి ఉన్న అవకాశాలను చర్చించామని చంద్రబాబు వివరించారు.
స్వర్ణాంధ్ర ప్రదేశ్-2047
స్వర్ణాంధ్ర ప్రదేశ్-2047 విజన్ ను సాకారం చేసేందుకు ఏపీ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని… ఈ లక్ష్యాన్ని సాధించడంలో, ఏపీ ప్రజల సాధికారతను పెంచడంలో గేట్స్ ఫౌండేషన్ తో భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుందని విశ్వసిస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పురోగతి కోసం తమ సమయం, ఆలోచనలు, మద్దతు ఇస్తున్నందుకు బిల్ గేట్స్ కు ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.

గొప్ప అవకాశం
చంద్రబాబు మాట్లాడుతూ, ఏపీ ప్రజల సాధికారత పెంచడంలో గేట్స్ ఫౌండేషన్ తో కలసి పని చేయడం రాష్ట్రానికి గొప్ప అవకాశం అని చెప్పారు. ముఖ్యంగా ఆరోగ్య పరిరక్షణ, అగ్రికల్చర్, డిజిటల్ ఎడ్యుకేషన్ రంగాల్లో ఆధునిక పరిజ్ఞానం ద్వారా పలు ప్రాజెక్టులను అమలు చేయాలని చర్చించారు.
చంద్రబాబు ధన్యవాదాలు
చివరగా, ఏపీ అభివృద్ధికి తమ సమయం, ఆలోచనలు, మద్దతు అందించినందుకు బిల్ గేట్స్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అనిచంద్రబాబు పేర్కొన్నారు.గేట్స్ ఫౌండేషన్ తో కలిసి మరిన్ని ప్రాజెక్టులను అమలు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.బిల్ గేట్స్ లాంటి ప్రపంచ ప్రముఖ వ్యాపారవేత్తలతో ఏపీ ప్రభుత్వం భాగస్వామ్యం కలిగి ఉండడం రాష్ట్రానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చే అవకాశాన్ని కల్పిస్తోంది.టెక్నాలజీ వినియోగంతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.ఈ భేటీ ద్వారా ఏపీ అభివృద్ధికి కొత్త మార్గాలు సృష్టించి, ప్రజల సంక్షేమానికి మరింత బలమైన ప్రణాళికలు రూపొందించే అవకాశం లభించిందని చెప్పొచ్చు.