CM Chandrababu Naidu inspects fire at Secretariat

CM Chandrababu : సచివాలయంలో అగ్నిప్రమాదం.. పరిశీలించిన సీఎం చంద్రబాబు

CM Chandrababu : వెలగపూడి సచివాలయంలోని రెండవ బ్లాక్‌లో తెల్లవారుజామున చోటు చేసుకున్న అగ్నిప్రమాద ప్రదేశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు. సీఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, హోంమంత్రి అనిత, జీఏడీ పొలిటికల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనాతో కలిసి సీఎం చంద్రబాబు పరిశీలించారు. అగ్నిప్రమాదం ఎలా జరిగిందని, ఏ సమయంలో చోటు చేసుకుందని సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రతిచోటా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, తద్వారా ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని అన్నారు.

Advertisements
 సచివాలయంలో అగ్నిప్రమాదం పరిశీలించిన సీఎం

అక్కడి అపరిశుభ్రతపై అసంతృప్తిని వ్యక్తం

అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశానికి ఫోరెన్సిక్ బృందం ఎన్ని గంటలకు వచ్చిందని అడిగారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు అవసరమైన ఆధారాలను సేకరించిందీ లేనిది అడిగారు. సచివాలయంలో అన్ని చోట్లా భద్రతా ప్రమాణాలన్నీ పాటిస్తున్నారా లేదా అన్నది ఆడిట్ చేయాలని సూచించారు. అనంతరం మొదటి బ్లాక్‌లోని బ్యాటరీ రూమ్‌ను కూడా సీఎం పరిశీలించారు. ఇటువంటి బ్యాటరీ గ్యాలరీనే రెండవ బ్లాక్‌లో అగ్నిప్రమాదానికి గురైందని సీఎంకు సీఎస్ వివరించారు. అనంతరం సీఎంఆర్ఎఫ్ విభాగాన్ని పరిశీలించారు. అక్కడి అపరిశుభ్రతపై అసంతృప్తిని వ్యక్తం చేసిన సీఎం, 24 గంటల్లో చెత్తనంతా క్లీన్ చేయాలని ఆదేశించారు. పని ప్రదేశాల్లో ఎక్కడా తాత్కాలికంగా కూడా చెత్త కనబడటానికి వీళ్లేదని అన్నారు.

Related Posts
నిర్లక్ష్యంతోనే తొక్కిసలాట: టీటీడీ చైర్మన్‌
ttd

టీటీడీలో జరిగిన ప్రాణనష్టంతో భక్తుల్లో తీవ్ర నిరసన వ్యక్తం అవుతున్నది. దీనితో నష్ట నివారణచర్యలకు టీటీడీ అధికారులు దిగారు. డీఎస్పీ నిర్లక్ష్యంగా గేట్లు తెరవడంతోనే తొక్కిసలాట జరిగిందని Read more

హీరోయిన్ తో ఈనెల 13న నారా రోహిత్ ఎంగేజ్మెంట్
Nara Rohiths Engagement on

టాలీవుడ్ హీరో నారా రోహిత్ పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఈనెల 13న హైదరాబాద్లో ఆయన ఎంగేజ్మెంట్ జరగనున్నట్లు సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవల ఆయన నటించిన ప్రతినిధి-2లో Read more

దళితుడ్ని కిడ్నాప్ చేసినందుకు వంశీని అరెస్ట్ చేశారు : లోకేశ్
Vamsi was arrested for kidnapping a Dalit .. Lokesh

ప్రజా సమస్యలపై పోరాడిన తమపై అక్రమ కేసులు అమరావతి: తప్పు చేసిన వైసీపీ నేతలను చట్టపరంగా శిక్షిస్తామన్నారు. 2019-24 మధ్య కొనసాగిన అరాచకపాలన అందరూ చూశారన్నారు. ప్రజా Read more

జనసేన ఆవిర్భావ సభకు మహిళలకు ప్రత్యేక ఆహ్వానం..!
జనసేన ఆవిర్భావ సభకు మహిళలకు ప్రత్యేక ఆహ్వానం..!

అమరావతి: పిఠాపురం వేదికగా జనసేన పార్టీ ఘనంగా నిర్వహించనున్న 12వ ఆవిర్భావ సభకు మహిళలను ఆహ్వానించేందుకు వినూత్న కార్యక్రమానికి పార్టీ శ్రీకారం చుట్టింది. ఇంటింటికీ వెళ్లి బొట్టు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×