chandrababu euphoria musica

మ్యూజికల్ నైట్ కు టికెట్ కొని హాజరైన సీఎం చంద్రబాబు

  • తనే స్వయంగా రూ.1 లక్షకు టికెట్ కొనుగోలు

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహించిన యుఫోరియా మ్యూజికల్ నైట్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ ఈవెంట్ ద్వారా తలసేమియా బాధితులకు నిధులు సేకరించాలనే లక్ష్యాన్ని ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమం ద్వారా ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తన నేతృత్వాన్ని మరింత రుజువు చేసుకున్నారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ సేవా గుణాన్ని కొనసాగిస్తూ ట్రస్ట్ సమర్థవంతంగా నడుపుతున్నారని అన్నారు.

Euphoria Musical Nigh2

ఈ కార్యక్రమానికి తనే స్వయంగా రూ.1 లక్షకు టికెట్ కొనుగోలు చేసి హాజరయ్యానని చంద్రబాబు తెలిపారు. తలసేమియా బాధితులకు తన సహాయం అందించడం తనకు గర్వకారణమని పేర్కొన్నారు. ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన ఈ భారీ ఈవెంట్‌కి నందమూరి, నారా కుటుంబ సభ్యులు హాజరై సందడి చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ప్రదర్శనను ప్రేక్షకులు ఆస్వాదించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు. తలసేమియా బాధితులకు సహాయంగా ప్రజలు కూడా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

Related Posts
బీజేపీ ఢిల్లీని ద్వేషిస్తుంది: కేజ్రీవాల్
బీజేపీ ఢిల్లీని ద్వేషిస్తుంది: కేజ్రీవాల్

భారతీయ జనతా పార్టీ ఢిల్లీని "భారతదేశ నేర రాజధాని"గా మార్చిందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం బీజేపీపై తీవ్రంగా విమర్శలు Read more

తెలంగాణ సెక్రటేరియట్‌ను పేల్చి వేస్తానని బెదిరింపులు..
Threats to blow up Telangana Secretariat

హైదరాబాద్‌: తెలంగాణ సచివాలయానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు సచివాలయానికి బాంబ్ పెట్టి పేల్చేస్తామని ఫోన్ చేసి బెదిరించడంతో.. భద్రతా Read more

బర్డ్ ఫ్లూ అంటే ఏమిటి ?
బర్డ్ ఫ్లూ భయం – పౌల్ట్రీ పరిశ్రమపై ప్రభావం, వ్యాప్తి, నివారణ మార్గాలు

బర్డ్ ఫ్లూ భయం – పౌల్ట్రీ పరిశ్రమపై ప్రభావం, వ్యాప్తి, నివారణ మార్గాలు బర్డ్ ఫ్లూ అంటే ఏమిటి? బర్డ్ ఫ్లూ (Avian Influenza) ఒక వైరల్ Read more

వరంగల్ లో దారుణం.. బీరు తాగించి సామూహిక అత్యాచారం..!
gang rape on pharmacy stude 1

వరంగల్ లోని ఓ ప్రైవేటు కాలేజీలో బీ ఫార్మసీ చదువుతున్న అమ్మాయిపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. నగర శివారులోని ఓ ప్రైవేట్​ కళాశాలలో Read more