amith sha cbn

నేడు అమిత్ షా, నిర్మలతో సీఎం చంద్రబాబు భేటీ

ఢిల్లీ పర్యటనలో భాగంగా నిన్న ప్రధాని మోదీతో సమావేశమైన సీఎం చంద్రబాబు ఈరోజు పలువురు కేంద్రమంత్రులను కలవనున్నారు. వరద నష్టం, నిధుల విడుదలపై హోంమంత్రి అమిత్ షా తో సమావేశం కానున్నారు. విశాఖ స్టీల్స్టాంట్ విలీన ప్రతిపాదనలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చర్చిస్తారు. అలాగే రాష్ట్రంలో రోడ్ల నిర్మాణంపై నితిన్ గడ్కరీతో సమాలోచనలు చేస్తారు. పీయూష్ గోయల్, హర్దీప్ సింగ్తో ఆయన భేటీ కానున్నారు.

వికసిత భారత్‌ లక్ష్యంలో భాగంగా 2047 నాటికి స్వర్ణాంధ్రను సాధించేలా కేంద్రం మద్దతివ్వాలని ప్రధాని మోడీ కి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ‘స్వర్ణాంధ్ర విజన్‌’ సాకారానికి సంపూర్ణంగా సహకరించాలని కోరారు. సోమవారమిక్కడ ప్రధాని నివాసంలో సీఎం చంద్రబాబు ఆయనతో సుమారు గంట పాటు చర్చించారు. రాష్ర్టానికి సంబంధించిన పలు అంశాలపై కీలక చర్చలు జరిపారు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు డిసెంబరులో శంకుస్థాపన సేందుకు రావలసిందిగా ఇదే సందర్భంగా అభ్యర్థించినట్లు తెలిసింది. అలాగే ఇటీవల భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన ఏపీకి మరిన్ని నిధులిచ్చి ఆదుకోవాలని కోరారు.

Related Posts
అమెరికా విద్యాశాఖ మంత్రిగా లిండా మెక్‌మహన్‌ నియామకం
Linda McMahon appointed as US Secretary of Education

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ తన టీమ్‌ను రెడీ చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే చాలా వరకు నియామకాలు పూర్తి Read more

అభిమానులకు భోజనం ఏర్పాటు చేసిన రామ్ చరణ్
charan food

గేమ్ ఛేంజర్ విడుదల సందర్భంగా హీరో రామ్ చరణ్ అభిమానుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. సినిమా విడుదల తర్వాత ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు హైదరాబాద్‌లోని తన Read more

70 గంటల వర్క్ వీక్: మరోసారి నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు
murthy

ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, పలు సార్లు వివాదాలకు గురైన వ్యాఖ్యలు చేయడంతో మరోసారి ఇంటర్నెట్‌లో సంచలనాన్ని సృష్టించారు.. ముంబైలో నవంబర్ 14, 2024 న జరిగిన Read more

జన్మతః పౌరసత్వం రద్దుపై అప్పీల్‌కు వెళ్తాం : ట్రంప్‌
donald trump

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ రద్దు చేసిన జన్మతఃపౌరసత్వ హక్కు ఆదేశాలను ఫెడరల్‌ కోర్టు నిలిపివేసింది. వలస వచ్చిన వారి సంతానానికి అటోమెటిక్​గా అమెరికా పౌరసత్వం Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *