ఢిల్లీ పర్యటనలో భాగంగా నిన్న ప్రధాని మోదీతో సమావేశమైన సీఎం చంద్రబాబు ఈరోజు పలువురు కేంద్రమంత్రులను కలవనున్నారు. వరద నష్టం, నిధుల విడుదలపై హోంమంత్రి అమిత్ షా తో సమావేశం కానున్నారు. విశాఖ స్టీల్స్టాంట్ విలీన ప్రతిపాదనలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చర్చిస్తారు. అలాగే రాష్ట్రంలో రోడ్ల నిర్మాణంపై నితిన్ గడ్కరీతో సమాలోచనలు చేస్తారు. పీయూష్ గోయల్, హర్దీప్ సింగ్తో ఆయన భేటీ కానున్నారు.
వికసిత భారత్ లక్ష్యంలో భాగంగా 2047 నాటికి స్వర్ణాంధ్రను సాధించేలా కేంద్రం మద్దతివ్వాలని ప్రధాని మోడీ కి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ‘స్వర్ణాంధ్ర విజన్’ సాకారానికి సంపూర్ణంగా సహకరించాలని కోరారు. సోమవారమిక్కడ ప్రధాని నివాసంలో సీఎం చంద్రబాబు ఆయనతో సుమారు గంట పాటు చర్చించారు. రాష్ర్టానికి సంబంధించిన పలు అంశాలపై కీలక చర్చలు జరిపారు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు డిసెంబరులో శంకుస్థాపన సేందుకు రావలసిందిగా ఇదే సందర్భంగా అభ్యర్థించినట్లు తెలిసింది. అలాగే ఇటీవల భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన ఏపీకి మరిన్ని నిధులిచ్చి ఆదుకోవాలని కోరారు.