CM Chandrababu brother Ramamurthy Naidu passed away

సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత

హైదరాబాద్‌: సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూశారు. అనారోగ్యం బారిన పడిన ఆయన గతకొంతకాలంగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందారు. పరిస్థితి విషమించడంతో శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలు సహా ఇతర కార్యక్రమాలన్నీ మంత్రి నారా లోకేష్ రద్దు చేసుకున్నారు. ఆసుపత్రికి సైతం చేరుకున్నారు. సీఎం చంద్రబాబు కూడా మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకొని హైదరాబాద్‌కు బయల్దేరారు.

1994 నుంచి 1999 వరకు చంద్రగిరి శాసనసభ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరపున రామ్మూర్తి నాయుడు ఎమ్మెల్యేగా పనిచేశారు. రామ్మూర్తి నాయుడు కొడుకు నారా రోహిత్ తెలుగు సినిమా నటుడు. రోహిత్ పలు హిట్ చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. రామ్మూర్తి మరణవార్త తెలిసిన టీడీపీ శ్రేణులు సంతాపం ప్రకటిస్తున్నారు.

కాగా, వాస్తవానికి చంద్రబాబు ఈరోజు ఢిల్లీ నుంచి మహారాష్ట్రకు వెళ్లి… ఎన్డీయే తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉంది. తమ్ముడి ఆరోగ్య పరిస్థితి విషమించిన నేపథ్యంలో ఆయన మహారాష్ట్ర ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు. ఏపీ మంత్రి నారా లోకేశ్ ఇప్పటికే గన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్ కు బయల్దేరారు. కాసేపట్లో ఆయన శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు.

Related Posts
2028లోపు మళ్లీ సీఎం అవుతా – కుమార స్వామి
kumaraswamy

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని, దీనికి ఆ పార్టీలోని అంతర్గత సమస్యలే కారణమవుతాయని కేంద్ర మంత్రి కుమారస్వామి జోస్యం చెప్పారు. 2028లోపు తాను మళ్లీ సీఎం పీఠం Read more

అక్రమంగా తరలిస్తున్న గోమాసం పట్టుబడిన కంటైనర్
img1

అక్రమంగా తరలిస్తున్న గోమాసం.. పట్టుబడిన కంటైనర్. పాతిపెట్టిన పోలీసులు… ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు.!( నక్కపల్లి ,ప్రభాతవార్త) గుట్టుచప్పుడు కాకుండా జాతీయ రహదారి మీదుగా గోమాసాన్ని తరలిస్తుండగా Read more

నుమాయిష్ ప్రారంభం వాయిదా
numaish exhibition hyderaba

హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జనవరి 1న ప్రారంభం కావాల్సిన నుమాయిష్ వాయిదా పడింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతితో ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏడు రోజుల Read more

వీహెచ్‌పీ హెచ్చరిక: ఉప్పల్‌లో భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్‌ను అడ్డుకుంటాం.
vhs

హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగబోయే భారత్-బంగ్లాదేశ్ ట్వంటీ 20 మ్యాచ్ పై విశ్వహిందూ పరిషత్ (VHP) తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. బంగ్లాదేశ్‌లో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *