
16వ ఆర్థిక సంఘం ఛైర్మన్ అరవింద్ పనగారియాను కలిసిన సీఎం చంద్రబాబు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. రాష్ట్రానికి కేటాయించే ఆర్థిక సంఘం నిధుల అంశంపై చంద్రబాబు, పయ్యావుల చర్చ. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ పనగారియాకు వివరించిన ఏపీ సీఎం, ఆర్థిక మంత్రి. ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని నిధుల కేటాయింపు విషయంలో పెద్ద మనస్సు చేసుకోవాలన్న ఏపీ సీఎం చంద్రబాబు.గత ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఛిన్నాభిన్నం చేసిందనే విషయాన్ని స్వయంగా నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదికలో ఉందంటూ సమావేశంలో ప్రస్తావించిన సీఎం చంద్రబాబు, ఆర్థిక మంత్రి పయ్యావుల.సీఎం, ఆర్థిక మంత్రితో పాటు.. పనగారియాను కలిసిన ఏపీ ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు.