New law in AP soon: CM Chandrababu

అధికారులను అలర్ట్ చేసిన సీఎం చంద్రబాబు

రాష్ట్రంలో భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. నెల్లూరు సహా పలు జిల్లాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఆకస్మిక వరదల పట్ల జాగ్రత్తగా ఉండాలని, వర్ష ప్రభావిత జిల్లాల్లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు నివేదించాలని సూచించారు.

బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాలపై కనిపిస్తోంది. నిన్నటి నుంచి రెండు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు తెల్లవారుజాము నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా ముసురు మొదలైంది. వాయుగుండం రేపు తీరం దాటే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. దీంతో మరో రెండు రోజుల వరకు తెలంగాణలోనూ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. మరోవైపు వాయుగుండం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ఇటు నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి, వైఎస్సార్, అన్నమయ్య జిల్లాలకు IMD రెడ్ అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రేపు పుదుచ్చేరి, నెల్లూరు మధ్య తీరం దాటొచ్చని అంచనా వేసింది. నెల్లూరు, ప్రకాశం, వైస్సార్, చిత్తూరు జిల్లాల్లో ఆకస్మిక వరదలకు ఆస్కారం ఉందని హెచ్చరించింది.

Related Posts
షేక్ హసీనాను వెనక్కి పంపండి: బంగ్లాదేశ్
షేక్ హసీనాను వెనక్కి పంపండి: బంగ్లాదేశ్

షేక్ హసీనా ని తిరిగి పంపించాలని: భారతదేశానికి బంగ్లాదేశ్ తాజా లేఖ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఆగస్టు 5 నుండి భారతదేశంలో ప్రవాస జీవితం Read more

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే శాతం ఎంత వరకు వచ్చిందంటే..!!
door to door survey

తెలంగాణ రాష్ట్ర సర్కార్ స‌మ‌గ్ర ఇంటింటి కుటుంబ స‌ర్వే చేస్తున్న సంగతి తెలిసిందే. నవంబర్ 09 నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్వే ప్రారంభమైంది. ప్రతి ఇంటికి Read more

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త
TTD Tickets

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త . ఏప్రిల్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ. 300) టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విడుదల చేసింది. Read more

ఆంధ్రాలో మహిళలకు ఉచిత కుట్టుమిషన్
women sewing

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీ మహిళలు సొంతంగా ఉపాధి పొందేందుకు కుట్టుపని Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *