Clash between two alliances in Jharkhand

జార్ఖండ్‌లో రెండు కూటముల మధ్య హోరాహోరీ

రాంచీ: జేఎంఎం, ఎన్డీయే కూటముల మధ్య జార్ఖండ్‌లో హోరాహోరీ పోరు కొనసాగుతున్నది. ఇరు పక్షాల మధ్య ఆధిక్యం మారుతూవస్తున్నది. ఎర్లీ ట్రెండ్స్‌లో ఎన్డీయే కూటమి 40 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఇండియా కూటమి 38 చోట్ల లీడ్‌లో ఉన్నది. ఇతరులు 3 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. మొత్తం 81 స్థానాలున్న జార్ఖండ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్‌ మార్క్‌ 41 సీట్లు దాటాల్సి ఉంది.

Advertisements

ప్రస్తుతం రాష్ట్రంలో జేఎంఎం నేతృత్వంలోని ఇండియా కూటమి అధికారంలో ఉన్నది. ఈ ఎన్నికల్లో జేఎంఎం 43, కాంగ్రెస్ 30, ఆర్జేడీ 6, సీపీఐ(ఎంఎల్) నాలుగు చోట్ల పోటీ చేయ‌గా, ప్రతిప‌క్ష ఎన్డీఏ కూట‌మి.. బీజేపీ 68, ఏజేఎస్‌యూ 10, జేడీయూ రెండు, లోక్‌జ‌న్‌శ‌క్తి(రామ్ విలాస్‌) పార్టీ ఒక చోట పోటీ చేశాయి. ఎన్డీఏ కూట‌మి 42 నుంచి 48 స్థానాల్లో, జేఎంఎం 25 -30 స్థానాల్లో మాత్ర‌మే గెలిచే అవ‌కాశం ఉంద‌ని ఎగ్జిట్ పోల్స్‌లో వెల్ల‌డైన విషయం తెలిసిందే.

ఎగ్జిట్ పోల్స్ అంచ‌నాలు త‌ల‌కిందులు అయ్యే అవ‌కాశం ఉంద‌ని జార్ఖండ్ ముక్తి మోర్చా జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ, అధికార ప్ర‌తినిధి సుప్రీయో భ‌ట్టాచార్య పేర్కొన్నారు. మ‌ళ్లీ తామే అధికారంలోకి వ‌స్తామ‌ని, ఎన్డీఏ కూట‌మికి ప్రజ‌లు వ్య‌తిరేక తీర్పు ఇస్తార‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. సీఎం హేమంత్ సోరెన్ కూడా త‌మ పార్టీ గెలుపుపై విశ్వాసంతో ఉన్నారు. త‌ప్ప‌కుండా అధికారంలోకి వ‌స్తామ‌నే హేమంత్ సోరెన్ ధీమాను వ్య‌క్తం చేస్తున్నారు.

Related Posts
Om Birla : నినాదాలు రాసి ఉన్న టీషర్టులు ధరించి సభకు రావొద్దు: స్పీకర్‌
Don't come to the House wearing T shirts with slogans on them.. Speaker Om Birla

Om Birla: ప్రతిపక్ష పార్టీ ఎంపీలు నినాదాలు రాసి ఉన్న టీ షర్టులు ధరించి లోక్ సభకు రావడం పై లోక్ సభ స్పీకర్ ఓంబిర్ల అసహనం Read more

IPL 2025: తొలి మ్యాచ్‌లోనే విరాట్ కోహ్లీ అదిరిపోయే రికార్డు
IPL 2025: తొలి మ్యాచ్‌లోనే విరాట్ కోహ్లీ అదిరిపోయే రికార్డు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 ప్రారంభ మ్యాచ్‌లోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు సృష్టించాడు. కోల్‌కతా నైట్ Read more

ఒకరిపై ఒకరు పిర్యాదు చేసుకున్న మంచు మోహన్ బాబు , మనోజ్
mohan babu manoj police com

మంచు మోహన్ బాబు ఇంట్లో ఆస్తుల గొడవలు ఇప్పుడు పోలీసులు స్టేషన్లలో ఒకరిపై ఒకరు ముప్పు ఉందంటూ పిర్యాదులు చేసుకునే వరకు వచ్చింది. ప్రముఖ సినీ నటుడు Read more

మళ్లీ ఇస్రో ‘స్పేడెక్స్‌’వాయిదా..
ISRO Postpones Space Docking Experiment Again

బెంగళూరు : ఇస్రో చేపట్టిన స్పేస్‌ డాకింగ్‌ ఎక్స్‌పెరిమెంట్‌(స్పేడెక్స్‌)కు అవాంతరాలు ఎదురవుతున్నాయి. గురువారం అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను అనుసంధానం(డాకింగ్‌) చేయాలని ఇస్రో భావించింది. ఇందుకోసం రెండు ఉపగ్రహాలను Read more

×