Civil services through WhatsApp.Meta Agreement between AP Govt

వాట్సప్‌ ద్వారానే పౌర సేవలు..మెటా- ఏపీ ప్రభుత్వం మధ్య ఒప్పందం

న్యూఢిల్లీ: ఢిల్లీలోని 1 జన్‌పథ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మెటా సంస్థ ప్రతినిధులు రవిగార్గ్‌, నటాషా, ఆర్టీజీఎస్‌ సీఈవో దినేశ్‌, ఐఏఎస్‌ అధికారి, ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీలో పౌర సేవలకు సంబంధించి మెటా- ఏపీ ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ మాట్లాడుతూ.. యువగళం హామీలు నెరవేర్చడంలో మెటాతో ఎంవోయూ చారిత్రాత్మక మైలురాయిగా అభివర్ణించారు. ”విద్యార్థులు, నిరుద్యోగులు వివిధ సర్టిఫికెట్ల కోసం పడుతున్న కష్టాలు యువగళం పాదయాత్ర సందర్భంగా ప్రత్యక్షంగా చూశా. మొబైల్‌ ద్వారానే ఆయా సర్టిఫికెట్లు అందిస్తామని పాదయాత్రలో హామీ ఇచ్చా. ఇచ్చిన హామీ మేరకు వాట్సప్‌ ద్వారానే వివిధ రకాల సర్టిఫికెట్లు, పౌరసేవలు అందించేలా మెటాతో ఒప్పందం చేసుకున్నాం. రానున్న రోజుల్లో మరిన్ని సేవలు ఆన్‌లైన్‌లో అతి సులువుగా, పారదర్శకంగా, అతి వేగంగా పొందే ఏర్పాట్లు చేస్తాం” అని మంత్రి లోకేశ్‌ తెలిపారు.

మెటాలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సేవలను వినియోగించుకుని వాట్సప్‌ ద్వారా ఏపీ ప్రజలకు పౌర సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని మెటా ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ సంధ్యా దేవనాథన్ తెలిపారు. ప్రజలు తమకు కావాల్సిన సేవలు పొందేందుకు వీలుగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌, వాట్సప్‌ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ ఫేస్ ఉంటుందన్నారు. డిజిటల్ టెక్నాలజీని వాడుకుని ఏపీ ప్రభుత్వం ద్వారా ప్రజలకు మరిన్ని ఉత్తమ సేవలు అందించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు.

Related Posts
ఏపీలో నేడే మద్యం షాపుల కోసం లాటరీ
Liquor shops lottery today in AP

అమరావతి: ఏపీలో నూతన ఎక్సైజ్ పాలసీలో భాగంగా ప్రైవేటు వ్యక్తులకు మద్యం షాపులను అప్పగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా Read more

మంచు ఫ్యామిలీ ఫైట్… మంచు లక్ష్మీ ఆసక్తికర పోస్ట్
manchu laxmi post

మంచు ఫ్యామిలీ మధ్య జరుగుతున్న ఆస్తి గొడవలు ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ నేపధ్యంలో మంచు లక్ష్మీ ప్రసన్న సోషల్ మీడియాలో ఆసక్తికరమైన పోస్టు Read more

బడ్జెట్‌పై పవన్ కల్యాణ్ స్పందన
బడ్జెట్ పై పవన్ కల్యాణ్ స్పందన

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన కేంద్ర బడ్జెట్ 2025-26పై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆయన అభిప్రాయంపట్ల మహిళా సాధికారత, యువత, Read more

చేనేత కార్మికులకు గుడ్ న్యూస్
chenetha workers good news

తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికుల కోసం మరో సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ‘వర్కర్ టు ఓనర్’ పథకం ద్వారా నేత కార్మికులను స్వయంసంపన్నులుగా మార్చే ప్రణాళికను Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *