సీఐఎస్ఎఫ్ చేతికి గన్నవరం ఎయిర్ పోర్ట్ బాధ్యతలు

గన్నవరం ఎయిర్ పోర్ట్ బాధ్యతలు ఇక నుండి కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) చేసుకోనుంది. దేశవ్యాప్తంగా అనేక విమానాశ్రయాల్లో సీఐఎస్ఎఫ్ సిబ్బందే భద్రతా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇకపై, గన్నవరం ఎయిర్ పోర్టు రక్షణ బాధ్యతలను కూడా సీఐఎస్ఎఫ్ చూసుకుంటుందని ఎయిర్ పోర్టు అథారిటీ తాజాగా ఏపీ డీజీపీకి లేఖ రాసింది.

ఇప్పటివరకు గన్నవరం ఎయిర్ పోర్టులో ఎస్పీఎఫ్ సిబ్బంది భద్రతా విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు వాళ్ల స్థానంలో సీఐఎస్ఎఫ్ సిబ్బంది బాధ్యతలు అందుకోనున్నారు. జులై 2 నుంచి గన్నవరం విమానాశ్రయం రక్షణ సీఐఎస్ఎఫ్ పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది.