CISCO sign key agreement with Telangana government.

CISCO: తెలంగాణ ప్రభుత్వంతో సిస్కో కీలక ఒప్పందం..!

CISCO: తెలంగాణ ప్రభుత్వంతో సిస్కో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈరోజు అసెంబ్లీ కమిటీని హాల్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సిస్కో బృందం సమావేశం నిర్వహించింది. స్కిల్ యూనివర్సిటీలో నైపుణ్య శిక్షణ అందించేందుకు ప్రభుత్వంతో సిస్కో సీఎం సమక్షంలో ఎంవోయూ కుదుర్చుకుంది. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డితో ప్రీమియర్ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా పీటర్ మాలినాస్కస్ ఎంపీ బృందంతో తెలంగాణ శాసనసభ కమిటీ హాల్‌లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా హై కమిషనర్ టు ఇండియా ఫిలిప్ గ్రీన్ కూడా పాల్గొన్నారు.

Advertisements
తెలంగాణ ప్రభుత్వంతో సిస్కో కీలక

ఏపీ ప్రభుత్వంతోను సిస్కో ఒప్పందం

అయితే సిస్కో ఉన్నత ఉద్యోగి అయిన ఇప్పాల రవీంద్రారెడ్డి మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఆయన గురించి పూర్తి సమాచారం వెల్లడి కావడంతో ఆయనను సీఎం రేవంత్ తో కలిసే టీం నుంచి తప్పించినట్లుగా భావిస్తున్నారు. మరోవైపు మంగళవారం ఏపీ ప్రభుత్వంతో సిస్కో ఒప్పందం చేసుకుంది. నారా లోకేష్ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. సిస్కో సౌత్ ఇండియా టెరిటరీ అకౌంట్ మేనేజర్ గా ఉన్న ఇప్పాల రవీంద్ర కూడా సమావేశానికి హాజరయ్యారు.

సిస్కోలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి

కానీ ఆయనే ఇప్పాల రవీంద్ర అని వీడియోలు రిలీజ్ అయ్యే వరకూ అధికార వర్గాల్లో ఎవరికీ తెలియదని అంటున్నారు. తెలిసిన తర్వాత టీడీపీ సోషల్ మీడియాలో విమర్శలు ప్రారంభమయ్యాయి. సిస్కోలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి ఇంత చీప్ గా సోషల్ మీడియా పోస్టులు పెడతారా అందరూ ఆశ్చర్యపోయారు. వెంటనే ఆయన గురించి సిస్కో టీమ్ కు సమాచారం ఇచ్చారు. మరోసారి ఏపీకి సంబందించిన ఎలాంటి విషయాల్లోనూ ఆయనను ఇన్వాల్వ్ చేయవద్దని స్పష్టం చేశారు. ఇప్పాల రవీంద్రారెడ్డి 2017లో సోషల్ మీడియా కేసుల్లో అరెస్టయ్యారు.

Related Posts
స్వయం ఉపాధి రుణ పథకాల్లో కీలక మార్పులు
స్వయం ఉపాధి రుణ పథకాల్లో కీలక మార్పులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనుకబడిన తరగతులు (బీసీ) మరియు ఆర్థికంగా బలహీన వర్గాల (ఈడబ్ల్యుఎస్) పేదరికాన్ని తగ్గించడంపై దృష్టి సారించి, స్వయం ఉపాధి సబ్సిడీ రుణ పథకాలకు కొత్త Read more

ఖమ్మం జిల్లా మధిరలో విషాదం
madira accident

ఖమ్మం జిల్లా మధిరలో కొంగర కేశవరావు (52) మరియు అతని కూతురు నూకారపు సరిత (28) ఇద్దరూ రైలు ఢీకొని ప్రాణాలు కోల్పోయారు. వీరు విజయవాడలో ఆస్పత్రికి Read more

10 లక్షల వీసాలు.. అమెరికా కాన్సులేట్ సరికొత్త రికార్డు
10 lakh visas.. American Consulate new record

న్యూఢిల్లీ: వరుసగా రెండో సంవత్సరం విజిటర్‌ వీసాలతోసహా 10 లక్షలకు పైగా నాన్‌ ఇమిగ్రంట్‌ వీసాలను అమెరికా భారత్‌కు జారీ చేసింది. 2008/2009 విద్యా సంవత్సరం తర్వాత Read more

Pawan Kalyan: త్వరలో జిల్లాల పర్యటనపై వెళ్లనున్నడిప్యూటీ సీఎం పవన్
Pawan Kalyan: త్వరలో జిల్లాల పర్యటనపై వెళ్లనున్నడిప్యూటీ సీఎం పవన్

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జిల్లాల పర్యటనకు సిద్ధం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వేదికపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక అడుగులు వేస్తున్నారు. తాను కేవలం అధికారి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×