CID should investigate comprehensive family survey.. Shabbir Ali

కుటుంబ సర్వేపై విచారణ జరిపించాలి : షబ్బీర్ అలీ

హైదరాబాద్‌: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన కొత్తలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆనాడు టీఆర్ఎస్ సర్కార్ నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేపై సీఐడీ ద్వారా విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి ఆయన లేఖ రాశారు. సర్వే కోసం కేటాయించిన రూ.100 కోట్ల నిధులను దుర్వినియోగం చేశారని లేఖలో ఆరోపించారు.

image

దీనిపై దర్యాప్తు చేయించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. అప్పట్లో సమగ్ర కుటుంబ సర్వేలో దాదాపు 4 లక్షల మంది సిబ్బంది పాల్గొన్నారని షబ్బీర్ అలీ వివరించారు. ప్రజల ఆధార్, రేషన్ కార్డు వివరాలు, బ్యాంకు సమాచారం, ఎల్‌పీజీ కనెక్షన్లు, వాహన రిజిస్ట్రేషన్ల సమాచారం, ఇతర వ్యక్తిగత వివరాలతో కూడిన 94 అంశాల సమాచారాన్ని సేకరించారని గుర్తుచేశారు. కానీ, ఆ పార్టీ అధికారంలో ఉన్న పదేళ్లలో ఏనాడూ వాటి వివరాలు బయట పెట్టలేదని, ప్రజల సున్నితమైన సమాచారాన్ని ప్రైవేట్ కంపెనీలకు విక్రయించినట్లు అనుమానాలు ఉన్నాయని వెల్లడించారు.

Related Posts
పాకిస్థాన్‌కు బలూచ్ లిబరేషన్ ఆర్మీ గట్టి హెచ్చరిక
పాకిస్థాన్‌కు బలూచ్ లిబరేషన్ ఆర్మీ గట్టి హెచ్చరిక

పాకిస్థాన్ రైలు హైజాక్ ఘటనతో భయాందోళనలు నెలకొన్నాయి. బలూచిస్థాన్‌లో రైలు హైజాక్ అయ్యి 20 గంటలకు పైగా అయ్యింది. ఈ రైలు హైజాక్ ఘటన నేపథ్యంలో పాకిస్థాన్ Read more

10 లక్షల వీసాలు.. అమెరికా కాన్సులేట్ సరికొత్త రికార్డు
10 lakh visas.. American Consulate new record

న్యూఢిల్లీ: వరుసగా రెండో సంవత్సరం విజిటర్‌ వీసాలతోసహా 10 లక్షలకు పైగా నాన్‌ ఇమిగ్రంట్‌ వీసాలను అమెరికా భారత్‌కు జారీ చేసింది. 2008/2009 విద్యా సంవత్సరం తర్వాత Read more

తెలంగాణ సీఎంకు కిషన్ రెడ్డి లేఖ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ: తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తాజాగా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి Read more

రాజకీయ పార్టీకి సలహాలిచ్చేందుకు ఫీజు వివరాలు వెల్లడించిన పీకే
prashant kishor reveals his fee for advising in one election

బీహార్: ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ బీహార్ లోని బెలాగంజ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన Read more