chiru anil

చిరు ఒప్పుకుంటే అలాంటి క్యారెక్టర్ రాస్తా – అనిల్ రావిపూడి

వరుస హిట్లతో ఫుల్ స్వింగ్ లో ఉన్న డైరెక్టర్ అనిల్ రావిపూడి..తాజాగా ‘సంక్రాంతికి వస్తున్నాం‘ అంటూ సంక్రాంతి రోజున వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. వెంకటేష్ – ఐశ్వర్య – మీనాక్షి చౌదరి జంటగా నటించిన ఈ మూవీని దిల్ రాజు నిర్మించారు.

Advertisements

అనిల్ రావిపూడి సినిమాలంటే ఎంటర్టైన్మెంట్ అని తెలిసిందే. ఈ సినిమా కూడా అంతే చిన్న పాయింట్ ని తీసుకొని ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్ సత్య ఆకెళ్ళ రావడం, అతన్ని కిడ్నాప్ చేయడం, YD రాజు, అతని భార్య, పిల్లలతో లైఫ్, మీనాక్షి రాజుని వెతుక్కుంటూ రావడం, ఆపరేషన్ గురించి సీఎంని కలవడంతో సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్ అంతా ఓ పక్క భార్య మరో పక్క మాజీ ప్రేయసి మధ్య రాజు ఎలా నలిగిపోయాడు చూపిస్తూనే సత్యని ఎలా కాపాడుకున్నారు అని చూపించారు.

ఫస్ట్ హాఫ్ ఎక్కడా ల్యాగ్ లేకుండా ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో అదిరిపోయే సాంగ్స్ తో సాగుతుంది. ఫస్ట్ హాఫ్ ని అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇంటర్వెల్ పెద్ద ట్విస్ట్ లు ఏమి లేకుండా సింపుల్ గానే సెట్ చేసారు. ఓవరాల్ గా సినిమా సూపర్ హిట్ అవ్వడం తో ఇప్పుడు అగ్ర హీరోలతో పాటు యంగ్ హీరోలు అనిల్ తో సినిమా చేసేందుకు పోటీ పడుతున్నారు. తన తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవితో చేయనున్నట్లు ఆయన ఇదివరకే ప్రకటించారు. కాగా మూవీ స్క్రిప్ట్ ఇంకా ఫైనలైజ్ కాలేదని అనిల్ చెప్పారు. చిరు ఒప్పుకుంటే ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు వంటి క్యారెక్టర్ రాస్తానని తెలిపారు. ఇదే నిజమైతే వింటేజ్ చిరంజీవిని చూస్తామని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Related Posts
అసెంబ్లీకి హాజరు కాకూడదని జగన్ నిర్ణయం
అసెంబ్లీకి హాజరు కాకూడదని జగన్ నిర్ణయం

ఏపీ బడ్జెట్ సమావేశాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) బహిష్కరణకు దిగింది. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంపై ఆగ్రహంతో, పార్టీ అసెంబ్లీకి Read more

Revanth Reddy : మూసీ పునరుజ్జీవంపై రేవంత్ రెడ్డి ఆదేశాలు
Revanth Reddy మూసీ పునరుజ్జీవంపై రేవంత్ రెడ్డి ఆదేశాలు

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు ఊపిరితిత్తుల్లా ఉన్న మూసీ నదీ పునరుద్ధరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు ముమ్మరం చేశారు ముస్సాయి ప్రక్షాళనను ఇక వాయిదా వేయొద్దని, దాని Read more

Chandrababu Naidu : సచివాలయంలో పుస్తకావిష్కరణ : సీఎం చంద్రబాబు
Chandrababu Naidu సచివాలయంలో పుస్తకావిష్కరణ సీఎం చంద్రబాబు

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ మార్గదర్శిగా నిలిచిన నేత చంద్రబాబు నాయుడి జీవితాన్ని, ఆయన దూరదృష్టిని ఆవిష్కరించే ఒక ప్రత్యేక పుస్తకం వెలుగులోకి వచ్చింది. ‘మన చంద్రన్న - Read more

విజయవాడలో భారీ అగ్నిప్రమాదం
Exhibition shops gutted in

అగ్నిప్రమాదం దాటికి ఎగ్జిబిషన్ కేంద్రం పూర్తిగా దగ్ధమైంది ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని సితార్ సెంటర్ కశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిప్రమాదం దాటికి ఎగ్జిబిషన్ Read more

×