మంత్రి నారా లోకేష్ పుట్టిన రోజు ఈరోజు. ఈ సందర్బంగా రాజకీయ నేతలే కాదు ఇతర రంగాల వారు సైతం పెద్ద ఎత్తున లోకేష్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ వస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ మెగాస్టార్ ట్విట్టర్ వేదికగా లోకేష్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు అందజేశారు. ”ప్రియమైన లోకేశ్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. తెలుగు ప్రజలకు సేవ చేయాలనే మీ నిర్విరామ కృషి, అభిరుచితో ఏపీ మరింత అభివృద్ధి సాధించేలా పాటుపడటం హర్షణీయం. మీరు చేసే అన్ని ప్రయత్నాలలో విజయం సాధించండి. ఈ ఏడాది అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నా” అని చిరంజీవి పేర్కొన్నారు. చిరంజీవి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

అలాగే టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు కూడా లోకేష్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా లోకేష్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు టీడీపీ నేతలు. ఆయా నియోజకవర్గాల్లో కేక్ కటింగ్ చేసి, రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో లోకేష్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. టీడీపీ కేంద్ర కార్యాలయంలో లోకేష్ బర్త్‌డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు.