సీఎం రేవంత్ అసంతృప్తి..చిరంజీవి రియాక్షన్

తెలంగాణలో గద్దర్ అవార్డుల అంశం మరోసారి హాట్ టాపిక్ అయింది. గద్దర్ అవార్డులు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైనా సినీ పరిశ్రమ ఆసక్తి చూపించలేదని రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేయడంతో మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగారు.

రవీంద్రభారతిలో డాక్టర్‌ సినారె 93వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి .. గద్దర్‌ పేరిట అవార్డులు ఇస్తామని ప్రకటించినా చిత్ర పరిశ్రమ తమని స్పందించలేదని పేర్కొన్నారు. గతంలో ఇదే వేదిక నుంచి గద్దర్‌ పేరిట అవార్డులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించినా సినీ రంగ ప్రముఖులు తమను సంప్రదించలేదన్నారు. నంది అవార్డుల స్థాయిలో ఆయా కార్యక్రమాలను చేపడుతామని.. ఇప్పటికైనా సినీ ప్రముఖులు ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్తే ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. ఈ క్రమంలోనే చిరంజీవి ఎక్స్‌ వేదికగా స్పందించారు

సీఎం రేవంత్‌రెడ్డి చొరవ తీసుకొని సినిమా అవార్డులను పునరుద్ధరిస్తూ.. పరిశ్రమలోకి ప్రభావవంతులకు ప్రజాకళాకారుడు గద్దర్‌ పేరిట ప్రతియేటా ‘గద్దర్‌ అవార్డులు’ ఇస్తుందని తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందని ప్రకటించారన్నారు. తెలుగు పరిశ్రమ తరఫున, ఫిలిం ఛాంబర్‌, ప్రొడ్యూషర్స్‌ కౌన్సిల్‌ ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లే బాధ్యత తీసుకోవాలని కోరుతున్నానంటూ మెగాస్టార్ ట్వీట్‌ చేశారు. గతంలో ప్రభుత్వం, ముఖ్యమంత్రి సినిమా పరిశ్రమలో నంది అవార్డుల స్థానంలో గద్దర్‌ పేరిట అవార్డులను ఇవ్వనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.