సీతారాం ఏచూరి మరణం ఫై చిరంజీవి ఎమోషనల్

సీపీఐ (ఎం) అగ్రనేత సీతారాం ఏచూరి గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరి చికిత్స తీసుకుంటుండగా.. పరిస్థితి విషమించి మరణించారు. సీతారాం మృతితో కేవలం కమ్యూనిస్టు పార్టీ శ్రేణుల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లో విషాదం నెలకొంది. ఆయన మరణం పట్ల సినీ సెలబ్రిటీలు సైతం స్పందిస్తూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగామెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా ఓ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ”ఐదు దశాబ్దాలకు పైగా రాజకీయ ప్రయాణంలో ఉన్న ప్రముఖ నాయకుడు, సీపీఐ (ఎం) అగ్రనేత శ్రీ సీతారాం ఏచూరి కన్నుమూశారనే వార్త నన్ను తీవ్ర మనోవేదనకు గురి చేసింది. విద్యార్థి కార్యకర్తగా ప్రారంభించినప్పటి నుంచి, శ్రీ ఏచూరి ఎప్పుడూ అణగారిన, సామాన్య ప్రజల గొంతుగా ఉండేందుకు కృషి చేశారు.

ఆయన కుటుంబానికి, అభిమానులకు, మొత్తం సీపీఐ (ఎం) సోదర వర్గానికి నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నా. ప్రజా సేవ, దేశం పట్ల అతని నిబద్ధత ఎల్లప్పుడూ గుర్తుండి పోతుంది. గొప్పగా ఫీల్ అవడంతో పాటు మిస్ అవుతుంది” అని రాసుకొచ్చాడు.