Chiranjeevi political

ఈ జన్మలో రాజకీయాల జోలికి వెళ్ళను – చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు శాశ్వతంగా గుడ్‌బై.మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు శాశ్వతంగా గుడ్‌బై చెప్పినట్లు స్పష్టం చేశారు. ‘బ్రహ్మా ఆనందం’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన ఆయన, ఇకపై తాను పూర్తిగా సినీ రంగానికే పరిమితం అవుతానని వెల్లడించారు. “ఈ జన్మంతా రాజకీయాలకు దూరంగా ఉంటా. ఈ జన్మలో రాజకీయాల జోలికి వెళ్ళను – చిరంజీవి.ఇకపై కళామతల్లి సేవలోనే నా జీవితం గడిపేస్తాను” అని చిరంజీవి స్పష్టం చేశారు.

ఇటీవల ఆయన రాజకీయ పెద్దలను కలవడం, పలువురు ప్రముఖులతో భేటీ కావడం వివాదాస్పదంగా మారింది. దీనిపై వివరణ ఇస్తూ, “నన్ను కొందరు రాజకీయ నాయకులను కలిశానంటే, ఏదో పాలిటిక్స్‌లోకి రావాలనుకుంటున్నట్టు ప్రచారం చేస్తున్నారు. కానీ నేను కలిసింది పరిశ్రమకు అవసరమైన సహాయం కోసమే” అని స్పష్టతనిచ్చారు. తన రాజకీయ ప్రస్థానంపై ఎలాంటి సందేహాలకు తావులేదని చిరంజీవి తెలిపారు.

Chiranjeevi Brahmanandam Pr

2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి, తర్వాత కాంగ్రెస్‌లో విలీనం చేసిన చిరంజీవి, 2014 తర్వాత పూర్తిగా రాజకీయాలకు దూరమయ్యారు. అప్పటి అనుభవాలు మళ్లీ రాజకీయాల్లోకి రాకూడదనే నిర్ణయానికి నడిపించాయని ఆయన చెప్పుకొచ్చారు.ఈ జన్మలో రాజకీయాల జోలికి వెళ్ళను – చిరంజీవి. “రాజకీయాల్లోకి వెళ్లి ప్రజాసేవ చేయాలనే ఆశయంతోనే వెళ్లాను. కానీ అక్కడి పరిస్థితులు నన్ను వెనక్కి తగ్గించాయి” అని ఆయన అభిప్రాయపడ్డారు.

తన లక్ష్యాలు, సేవా కార్యక్రమాలను పవన్ కళ్యాణ్ కొనసాగిస్తారని చిరంజీవి తెలిపారు. “పవన్ కళ్యాణ్ ప్రజాసేవ కోసం రాజకీయాల్లో కొనసాగుతున్నారు. నా ఆశయాలను ఆయన నెరవేర్చుతారు. నేను ఇక నా పరిశ్రమకు సేవ చేయడానికే పరిమితం అవుతాను” అని ఆయన పేర్కొన్నారు. రాజకీయాల నుంచి పూర్తిగా దూరంగా ఉన్నప్పటికీ, పవన్ కళ్యాణ్‌కు తగిన సలహాలు, మద్దతు అందిస్తానని చిరంజీవి చెప్పారు.

తన సినీ ప్రస్థానం, భవిష్యత్తు ప్రాజెక్టుల గురించి కూడా చిరంజీవి ప్రస్తావించారు. త్వరలోనే కొత్త సినిమాలతో అభిమానులను అలరించనున్నట్లు తెలిపారు. “సినిమా నా ప్రాణం. నా కెరీర్‌లో ఇంకా ఎన్నో మంచి సినిమాలు చేయాలి. అదే నా లక్ష్యం” అని చెప్పారు. చిరంజీవి ఈ ప్రకటనతో తన రాజకీయ రీ-ఎంట్రీపై వస్తున్న ఊహాగానాలకు ముగింపు పలికినట్లయింది.

Related Posts
‘ఛలో ఢిల్లీ’ ర్యాలీలో ఉద్రిక్తత
farmers protest

కనీస మద్దతు ధరకు చట్టబద్ధతతో పాటు పలు డిమాండ్ల సాధనే లక్ష్యంగా రైతులు శనివారం పునఃప్రారంభించిన ‘ఛలో ఢిల్లీ’ ర్యాలీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. చాలాకాలంగా రైతులు తమ Read more

మహిళపై చిరుత దాడి
Leopard attack on woman

ఆదిలాబాద్‌ జిల్లాలో చిరుతపులి భయం వీడడం లేదు. తాజాగా బజార్హాత్నూర్ మండలంలో చిరుతపులి దాడి జరిగింది. ఓ మహిళపై చిరుత దాడి చేయడంతో ఆమె ముఖానికి తీవ్ర Read more

Mohana Ranga Rao: వల్లభనేని వంశీ అనుచరుకి ఏప్రిల్‌ 9 వరకు రిమాండ్‌
Vallabhaneni Vamsi follower Ranga remanded till April 9

Mohana Ranga Rao: గన్నవరం టీడీపీ కార్యాలయంపై 2023 ఫిబ్రవరి 20న జరిగిన దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముఖ్య అనుచరుడు ఓలుపల్లి మోహనరంగాకు Read more

బడ్జెట్‌పై పవన్ కల్యాణ్ స్పందన
బడ్జెట్ పై పవన్ కల్యాణ్ స్పందన

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన కేంద్ర బడ్జెట్ 2025-26పై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆయన అభిప్రాయంపట్ల మహిళా సాధికారత, యువత, Read more