టాలీవుడ్ యంగ్ హీరో విష్వక్సేన్ ప్రముఖ దర్శకుడు రామ్‌నారాయణ్ కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం ‘లైలా’ ఈ సినిమాలో విష్వక్ తొలిసారి లేడీ గెటప్‌లో కనిపించనున్నారు. ఈ సినిమా ప్రేమికుల రోజు, ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చిత్ర బృందం ప్రస్తుతం ప్రచార కార్యక్రమాలను శరవేగంగా నిర్వహిస్తోంది. త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఉంటుంది.ఈ ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. వాటిని బలపరుస్తూ హీరో విష్వక్సేన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్టు పెట్టి ఈవెంట్‌కు చిరంజీవి గారి రావడాన్ని అధికారికంగా వెల్లడించారు.

పోస్టులో “మా ఆహ్వానాన్ని స్వీకరించి ‘లైలా’ సినిమా కోసం మద్దతు ఇవ్వడానికి వస్తున్న మెగాస్టార్ చిరంజీవి గారికి చాలా ధన్యవాదాలు. మీరు ఎప్పుడూ మా సినిమాలకు అద్భుతమైన మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు అని విష్వక్ పేర్కొన్నారు. అయితే, ఈ సందర్భంగా నిర్మాత సాహు గారపాటి, హీరో విష్వక్సేన్ చిరంజీవి ఇంటికి వెళ్లి ఆయన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఆహ్వానించారు. చిరంజీవి గారు ఆహ్వానాన్ని అంగీకరించి, పూల మాల వేసుకుని, బహుమతితో సన్మానించారు. ఈ ఫొటోలు విష్వక్సేన్ తన ఇన్‌స్టా స్టోరీలో పంచుకున్నారు ఇది నెట్లో వైరల్‌గా మారింది.‘లైలా’ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి, దానితో పాటు మెగాస్టార్ చిరంజీవి మద్దతు మరింత ఉత్సాహాన్ని తెచ్చింది.