ఈ రోజుల్లో చిన్న వయసులోనే పిల్లల్లో కంటి చూపు సమస్యలు అధికంగా కనిపిస్తున్నాయి. ఎక్కువ స్క్రీన్ టైమ్, మొబైల్, టీవీ, కంప్యూటర్‌లకు ఎక్కువ సమయం కేటాయించడం వల్ల కంటి ఆరోగ్యం ప్రభావితమవుతోంది. అదనంగా, లో లైట్లో చదవడం, పోషకాహార లోపం, శరీరానికి అవసరమైన విటమిన్లు తగ్గిపోవడం వంటి కారణాలు కూడా కంటి చూపు సమస్యలకు దారి తీస్తున్నాయి.
స్వస్థతకు సహజ మార్గాలు
పిల్లల కంటి ఆరోగ్యాన్ని కాపాడాలంటే సహజ కాంతిలో ఎక్కువ సమయం గడపడం ఎంతో ముఖ్యం. పచ్చని వాతావరణంలో ఆడుకోవడం ద్వారా కంటి కండరాలు సహజంగా వ్యాయామం పొందుతాయి. పిల్లలకు రోజూ కనీసం 8-10 గంటలు నిద్ర రావడం అవసరం. కంటి వ్యాయామాలు చేయడం ద్వారా కంటి మసిల్స్ మెరుగుపడతాయి.

ఆహారం ద్వారా కంటి ఆరోగ్యం
కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సరైన ఆహారం తీసుకోవడం అత్యంత అవసరం. క్యారెట్, పాలకూర, టమాట, బాదం, వాల్‌నట్స్ వంటి పోషకాహారంతో కూడిన ఆహారం తీసుకుంటే, కంటి చూపు మెరుగుపడుతుంది. ముఖ్యంగా విటమిన్ A, విటమిన్ C, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యానికి మంచిది.
నివారణకు అనుసరించాల్సిన జాగ్రత్తలు
కంటి చూపు సమస్యలు తగ్గించుకోవాలంటే, స్క్రీన్ టైమ్‌ను గణనీయంగా తగ్గించడం ముఖ్యమైన జాగ్రత్త. పాఠశాల విద్యార్థులు చదివే సమయంలో సరైన లైటింగ్ ఉండేలా చూడాలి. ప్రతి 20 నిమిషాలకు 20 సెకండ్ల పాటు కంటికి విశ్రాంతి ఇవ్వడం మంచిది. ఇలా కొన్ని మార్గదర్శకాలను పాటించడం ద్వారా పిల్లల్లో కంటి ఆరోగ్యాన్ని సమర్థంగా కాపాడుకోవచ్చు.