Chevireddy Bhaskar Reddy will be accused in the High Court.

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు.. !

అమరావతి : వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. గతంలో బాలికపై అత్యాచారం జరిగిందని అసత్య ప్రచారం చేశారని ఆయనపై ఫిర్యాదులు వచ్చాయి. ఈ మేరకు తిరుపతి పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని ఆయన ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో తాజాగా శుక్రవారం కోర్టు చెవిరెడ్డి పిటిషన్‌ను కొట్టివేసింది.

తిరుపతి జిల్లా యర్రావారిపాలెం మండలానికి చెందిన బాలికపై అత్యాచారం జరిగిందని వ్యాఖ్యానించడంతో పాటు సోషల్‌ మీడియాలో ప్రసారం చేశారన్న ఆరోపణలతో చెవిరెడ్డిపై కేసు నమోదైంది. వాస్తవాలు నిర్ధారించుకోకుండా అసత్య ప్రచారం చేయడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించారు. దీంతో బాలిక తండ్రి ఫిర్యాదు ఆధారంగా పోక్సో కేసు పెట్టారు.

ఇదిలా ఉండగా, గతంలో ఓ బాలిక విషయంలో చెవిరెడ్డి చేసిన వ్యాఖ్యల ఆధారంగా తిరుపతి పోలీసులు ఆయనపై ఫోక్సో కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని బాలిక తండ్రి చెప్పినా.. గతంలో ఇచ్చిన వాంగ్మూలం రికార్డు చేశారు. దీంతో ఆయనపై ఫోక్సో కేసు నమోదు చేశారు.

దీంతో మాజీ ఎమ్మెల్యే ముందస్తు బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసులో తన ప్రమేయం లేదని ఆయన తరఫున లాయర్స్ వాదనలు వినిపించారు. అయితే హైకోర్టు ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం తీర్పు రిజర్వ్ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా, హైకోర్టు ఆ పిటిషన్‌ను కొట్టివేసింది.

Related Posts
వైకుంఠ ఏకాదశి: తిరుమలలో ఏర్పాట్లు
వైకుంఠ ఏకాదశి: తిరుమలలో ఏర్పాట్లు

తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జె. శ్యామలరావు జనవరి 10 నుండి 19 వరకు నిర్వహించబోయే వైకుంఠ ఏకాదశి సందర్బంగా సాధారణ యాత్రికులకు వైకుంఠ Read more

బిల్ గేట్స్ తో చంద్రబాబు సమావేశం!
babu and bill gates

దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ పారిశ్రామికవేత్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మైక్రోసాఫ్ట్ Read more

గేమ్ ఛేంజర్ నుంచి మెలోడీ సాంగ్ విడుదల
arugumeedha

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - శంకర్ కలయికలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ మూవీ..సంక్రాంతి కానుకగా జనవరి 10 న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున Read more

కుంభమేళాలో ‘అఖండ-2’ షూటింగ్
కుంభమేళాలో 'అఖండ 2' షూటింగ్

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'అఖండ 2: తాండవం ". ఇంటర్నెట్లో ప్రసారమవుతున్న నివేదికలు మరియు వీడియోల ప్రకారం, బోయపాటి బృందం ప్రయాగ్రాజ్లోని మహాకుంభ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *