bowler

Cheteshwar Pujara: ఆసీస్ బౌలర్లకు కొరకరాని కొయ్యగా నిలిచిన ఈ ఆటగాడికి బీసీసీఐ చోటిస్తుందా

టీమిండియా సీనియర్ బ్యాట్స్‌మెన్ చటేశ్వర్ పుజారా 103 టెస్ట్ మ్యాచ్‌ల అనుభవం ఉన్నప్పటికీ జట్టులో తన స్థానాన్ని చాలా కాలంగా కోల్పోయాడు అతను చివరిసారిగా 2023 జూన్‌లో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆడాడు ఆ తర్వాత అతడికి జాతీయ జట్టులో అవకాశాలు దక్కలేదు అయినప్పటికీ పుజారా దేశవాళీ మరియు కౌంటీ క్రికెట్‌లో మాత్రం తన ప్రతిభను కొనసాగిస్తూ పరుగుల వరద పారిస్తున్నాడు ఇటీవలి రంజీ ట్రోఫీ పోటీలో డబుల్ సెంచరీ సాధించాడు ఇది ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అతడి 18వ అర్ధ సెంచరీగా నిలిచింది

ఈ సమయంలో నవంబర్ నెలలో ప్రారంభమవుతున్న భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి పుజారాను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయనే చర్చలు జరుగుతున్నాయి 36 ఏళ్ల పుజారాకు ఆస్ట్రేలియా పర్యటనల్లో గొప్ప అనుభవం ఉంది 2018-19 సిరీస్‌లో అతను 1,258 బంతులు ఆడి 521 పరుగులు సాధించాడు తద్వారా సిరీస్‌లో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు మూడేళ్ల తరువాత జరిగిన సిరీస్‌లో కూడా 928 బంతులు ఆడి 271 పరుగులు సాధించి భారత బ్యాటింగ్ లైనప్‌కు బలమైన వెన్నెముకగా నిలిచాడు ఆసీస్ పేసర్లు ప్యాట్ కమిన్స్ జాస్ హేజిల్‌వుడ్ మిచెల్ స్టార్క్ వంటి గంభీర బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొనే గుణం పుజారాకుంది. ఆసక్తికరంగా ప్రస్తుతం ఇరు జట్లలో అత్యధిక టెస్ట్ బంతులను ఎదుర్కొన్న ఆటగాడు పుజారానే కావడం విశేషం ఇది పుజారాను తిరిగి జట్టులోకి తీసుకోవడానికి ఒక కారణంగా పేర్కొనవచ్చు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్టర్లు ఈ విషయాలను పరిగణలోకి తీసుకుని అతడికి అవకాశం కల్పించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం భారత జట్టును అక్టోబర్ 28న ప్రకటించే అవకాశం ఉంది పుజారా వంటి అనుభవజ్ఞుడైన ఆటగాడికి ఆ జట్టులో చోటు కల్పిస్తారా లేదా అనేది క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

    Related Posts
    ఆపసోపాలు పడుతూ లక్ష్యాన్ని ఛేదించిన దక్షిణాఫ్రికా
    2nd t20

    గెబెర్హా వేదికగా జరిగిన రెండవ టీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఉత్కంఠభరితంగా భారత్‌పై విజయాన్ని సాధించింది. తక్కువ స్కోరింగ్ మ్యాచ్ అయినప్పటికీ ఉత్కంఠతో సాగిన ఈ పోరులో చివరకు Read more

    క్యాచ్ వదిలేసి క్షమాపణ చెప్పిన హార్దిక్ పాండ్య
    Hardik Pandya

    డర్బన్ వేదికగా భారత్ మరియు దక్షిణాఫ్రికా మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య మైదానంలో ఫీల్డింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. పాండ్యా Read more

    Smriti Mandhana;భార‌త్ త‌ర‌ఫున అత్య‌ధిక సెంచ‌రీలు (08) చేసిన మ‌హిళా క్రికెట‌ర్‌గా స్మృతి :
    smriti mandhana

    టీమిండియా మహిళా క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన అద్భుతమైన ప్రదర్శనతో అరుదైన రికార్డు సృష్టించింది. మంగళవారం న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో సెంచరీతో మెరిసిన Read more

    క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం
    vinod

    భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్య పరిస్థితి మరింతగా క్షీణించింది.అనారోగ్య పరిస్థితితో కొద్ది వారాలుగా ఇబ్బంది పడుతూ గతం ఇటీవల థానేలోని ఆకృతి ఆసుపత్రిలో చేరిన Read more

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *