సహకార్‌ యాప్‌తో ఓలా, ఉబర్‌, ర్యాపిడో దోపిడికి చెక్‌

Ola, rapido, uber: సహకార్‌ యాప్‌తో ఓలా, ఉబర్‌, ర్యాపిడో దోపిడికి చెక్‌

ప్రధాన నగరాల్లో ఓలా, ఉబర్‌, ర్యాపిడోల వినియోగం బాగా పెరిగిపోయింది. విపరీతంగా పెరుగుతున్న డిమాండ్‌ దృష్ట్యా.. ఆయా కంపెనీలు వినియోగదారుల నుంచి భారీగా ఛార్జీలు వస్తూలు చేస్తున్నాయి. అలా అని క్యాబ్‌ డ్రైవర్లు అంతే మొత్తం చెల్లించడం లేదు. కస్టమర్‌ నుంచి తీసుకున్న ఛార్జీలో భారీగా కోత విధించి.. మిగతా డబ్బును డ్రైవర్లకు, రైడర్లకు చెల్లిస్తున్నాయి. వీటిపై డ్రైవర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సూపర్‌ ఐడియాతో ముందుకు వచ్చింది. సహకార్‌ ట్యాక్సీ పేరుతో ఒక యాప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పార్లమెంట్‌లో వెల్లడించారు.

Advertisements
సహకార్‌ యాప్‌తో ఓలా, ఉబర్‌, ర్యాపిడో దోపిడికి చెక్‌

సహకార్‌ ట్యాక్సీ విధానం
డ్రైవర్లకు నేరుగా ప్రయోజనం చేకూర్చేలా రూపొందించబడిన సహకార ఆధారిత రైడ్-హెయిలింగ్ సేవ ‘సహకార్‌ ట్యాక్సీని ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. ఇందులో సహకార సంఘాలు ద్విచక్ర వాహనాలు, ట్యాక్సీలు, ఆటో రిక్షాలు నమోదు చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. “ఇది కేవలం నినాదం కాదు. దీనిని క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి సహకార మంత్రిత్వ శాఖ మూడున్నర సంవత్సరాలుగా అవిశ్రాంతంగా కృషి చేసింది. కొన్ని నెలల్లో, డ్రైవర్లకు ప్రత్యక్ష లాభాలు అందించే విధంగా ఒక ప్రధాన సహకార ట్యాక్సీ సేవ ప్రారంభిస్తామని అని హోం మంత్రి అన్నారు.
రెండు కంపెనీలకు నోటీసులు
వినియోగదారుడు ఐఫోన్ లేదా ఆండ్రాయిడ్ ఫోన్‌ల బుక్ చేసుకుంటున్నారా అనే దాని ఆధారంగా కూడా రైడ్ ఛార్జీలు మారుతున్నాయని నివేదికలు వెలువడిన తర్వాత సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) ఇటీవల రెండు కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. ఈ ఆరోపణలకు ప్రతిస్పందనగా, ఓలా ప్లాట్‌ఫామ్ ఆధారిత ధర వివక్షత వాదనలను తోసిపుచ్చింది. “మా కస్టమర్లందరికీ మేము ఒక విధమైన ధరలు కలిగి ఉన్నాం, సెల్‌ఫోన్ ఆధారంగా ధర నిర్ణయించడం లేదని వెల్లడించింది. ఉబెర్ కూడా ఈ ఆరోపణలను ఖండించింది.

Related Posts
అందర్నీ నవ్వుల్లో ముంచేసిన సీఎం చంద్రబాబు
babu balayya

ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన సందర్భంగా, ఆయన గౌరవార్థం నారా భువనేశ్వరి ప్రత్యేక విందు ఏర్పాటు Read more

హైదరాబాద్‌లో ముజిగల్‌ మ్యూజిక్‌ అకాడమీ
Muzhigal Music Academy in Hyderabad

కామాక్షి అంబటిపూడి ( ఇండియన్ ఐడెల్ గాయని) ప్రారంభించారు. వ్యవస్థీకృత సంగీత పరిశ్రమలో సుప్రసిద్ధ సంస్థగా తమను తాము నిలుపుకునేందుకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న ముజిగల్‌, తమ కార్యకలాపాలను Read more

ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’గా నిలిచిన తెలుగు అమ్మాయి..
ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ'గా నిలిచిన తెలుగు అమ్మాయి..

మ‌లేసియాలోని కౌలాలంపూర్‌లో అండర్-19 మ‌హిళల టీ20 వరల్డ్ కప్‌లో తెలుగు అమ్మాయి గొంగ‌డి త్రిష అద్భుతంగా ప్ర‌ద‌ర్శించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ టోర్నమెంట్‌లో ఆమె చేసిన Read more

Modi: ఏపీలో ప్రధాని మోదీ పర్యటన..ఎప్పుడంటే !
Narendra Modi శాంతి ప్రయత్నాలను పాక్ విఫలం చేసిందన్న మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్వరలో ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. అమరావతి రాజధాని అభివృద్ధి పనులను పునఃప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో, ఈ పర్యటనకు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×