రేపు ఫ్రీ బస్సు స్కిం ఫై చంద్రబాబు సమీక్ష

ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్..ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో పడింది. ఇప్పటికే పలు హామీలను నెరవేర్చగా..మహిళలంతా ఎదురుచూస్తున్న ఫ్రీ బస్సు స్కిం ఫై ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుపై ఆర్టీసీ అధికారులు నివేదిక ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఉచిత బస్సు ప్రయాణానికి నెలకు రూ.250 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. తెలంగాణ, కర్నాటకలో ఆర్టీసీ అధికారులు అధ్యయనం చేస్తున్నారు.

సోమవారం ఆర్టీసీ,రవాణా శాఖ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. ఉచిత బస్సు ప్రయాణంపై రేపు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏపీలో రోజు 36-37 లక్షల మంది ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నారు. ఇందులో 40 శాతం మంది అంటే.. 15 లక్షల మంది మహిళా ప్రయాణికులు ఉన్నారు. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌, సిటీఆర్డీనరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లో మాత్రమే ఉచిత ప్రయాణం సౌకర్యాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. ఏపీలో కూడా ఇదే విధానం అమలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.