babu and bill gates

బిల్ గేట్స్ తో చంద్రబాబు సమావేశం!

దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ పారిశ్రామికవేత్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తో ఈరోజు చంద్రబాబు భేటీ అవుతున్నారు. వీలైనంత వరకు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి చంద్రబాబు కృషి చేస్తున్నారు. మూడో రోజైన ఈరోజు కూడా చంద్రబాబు పలు హైప్రొఫైల్ ముఖాముఖి సమావేశాలు నిర్వహించనున్నారు. ఈరోజు యూనిలీవర్, డీపీ వరల్డ్ గ్రూప్, పెట్రోలియం నేషనల్ బెర్హాద్ (పెట్రోనాస్), గూగుల్ క్లౌడ్, పెప్సీ కో, ఆస్ట్రా జెనెకా సంస్థల అధిపతులతో సమావేశం కానున్నారు. ఏపీ సామాజిక, ఆర్థిక అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే దిశగా భాగస్వామ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా బిల్ గేట్స్ తో చంద్రబాబు చర్చలు జరుపుతారు.

సుస్థిర ఇంధన కార్యక్రమాలకు సంబంధించి గ్రీన్ కో సంస్థతో ఎంఓయూ కుదుర్చుకోనున్నారు. సస్టెయినబుల్ ఎనర్జీ రంగంలో ఇదొక కీలక అడుగుగా చెప్పుకోవచ్చు.దీనితోపాటు కీలక రౌండ్ టేబుల్ చర్చల్లో చంద్రబాబు పాల్గొంటారు. సహజ వ్యవసాయం, గ్రీన్ హైడ్రోజన్ రెన్యువబుల్ ఎనర్జీ, ఏపీలో పెట్టుబడులను ప్రోత్సహించడం తదితర అంశాలపై చంద్రబాబు చర్చలు జరుపుతారు.రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ఉన్నతమైన మౌలిక సదుపాయాలు, పెట్టుబడిదారులకు ఉన్న స్నేహపూర్వకమైన పాలసీలు, విభిన్న రంగాల్లో ఉన్న అవకాశాలపై పెట్టుబడిదారులకు చంద్రబాబు వివరిస్తారు.

Related Posts
సరస్వతీ పవర్ భూముల రిజిస్ట్రేషన్లు రద్దు..ఏపీ సర్కార్‌

అమరావతి: సరస్వతీ పవర్ ప్లాంట్‌కు కేటాయించిన అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్‌ను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. సరస్వతీ భూముల్లో అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నాయన్న అధికారుల నివేదికతో చర్యలు Read more

రామ్మూర్తి నాయుడు మృతికి ప్రధాని సంతాపం..నారా రోహిత్‌కు లేఖ
PM Modi condolence letter to Nara Rohit on death of Rammurthy Naidu

న్యూఢిల్లీ: ప్రముఖ సినీ నటుడు నారా రోహిత్ తండ్రి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. మొన్న Read more

ఏపీలో 14 నుండి సాగునీటి సంఘాలకు ఎన్నికలు – మంత్రి డా.నిమ్మల రామానాయుడు
Elections to irrigation soc

అమరావతి : ఈ నెల 14 నుండి సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా.నిమ్మల రామానాయుడు తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయం Read more

పేర్ని నాని సతీమణి జయసుధకు మరోసారి నోటీసులు

రేషన్ బియ్యం మాయం కేసులో వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధకు సంబంధించి కేసు రోజుకో మలుపు తిరుగుతున్నది. తాజాగా మరోసారి పోలీసులు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *