డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ కు సీఎం చంద్రబాబు అభినందనలు

ఏపీలో కూటమి భారీ విజయం సొంతం చేసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. బుధువారం సీఎం గా చంద్రబాబు తో సహా 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసారు. కాగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికీ వెంటనే వారికీ శాఖలు కేటాయిస్తారని భావించారు కానీ శుక్రవారానికి వాయిదా వేశారు.ఇక కొద్దీ సేపటి క్రితం మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలను మీడియా కు తెలియజేసారు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కీలక బాధ్యతలు అప్పగించారు. డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్‌ అండ్ టెక్నాలజీ శాఖలను కేటాయించారు. ఈ శాఖలన్నీ చాల ప్రాధాన్యం అయినవి.

ఇక ఈ సందర్బంగా చంద్రబాబు..పవన్‌ కల్యాణ్‌కు అభినందనలు తెలిపారు. మంత్రివర్గంలోని నా సహచరులకు శాఖల కేటాయింపు జరిగిన సందర్భంగా వారికి నా అభినందనలు అని పేర్కొన్నారు.. అందరం కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేస్తూ, ప్రజా పాలన శకానికి నాంది పలుకుతామని ప్రతిజ్ఞ చేశాం. మంత్రులుగా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి కృషి చేస్తారని నాకు నమ్మకం ఉందన్నారు.. సేవ, భక్తితో కూడిన ఈ యాత్రను ప్రారంభించిన అందరికీ నా శుభాకాంక్షలు అని తెలిపారు సీఎం.

మంత్రుల శాఖల వివరాలు :

పవన్ కళ్యాణ్ – డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్‌, గ్రామీణ అభివృద్ధి, అటవీ, పర్యావరణం, సైన్స్‌ అండ్ టెక్నాలజీ శాఖలు

నారా లోకేష్‌ : మానవ వనరులు అభివృద్ధి, ఐటీ ఎలక్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్ శాఖలు

అచ్చెన్నాయుడు : వ్యవసాయశాఖ

నాదెండ్ల మనోహర్‌ : ఆహారం, పౌరసరఫరాల శాఖ

వంగలపూడి అనిత : హోం మంత్రిత్వ శాఖ

పొంగూరు నారాయణ : పురపాలకశాఖ, పట్టణాభివృద్ధి

సత్యకుమార్‌ యాదవ్‌ : ఆరోగ్యశాఖ

నిమ్మల రామానాయుడు : నీటిపారుదల శాఖ

మహ్మద్‌ ఫరూఖ్‌ : న్యాయశాఖ, మైనారిటీ సంక్షేమం

ఆనం రామనారాయణరెడ్డి : దేవాదాయ శాఖ

పయ్యావుల కేశవ్‌ : ఆర్థిక శాఖ

అనగాని సత్యప్రసాద్‌ : రెవెన్యూ శాఖ

కొలుసు పార్థసారథి: హౌసింగ్‌, I &PR శాఖలు

డోలా బాలవీరాంజనేయస్వామి: సాంఘిక సంక్షేమ శాఖ

గొట్టిపాటి రవికుమార్‌ : విద్యుత్‌ శాఖ

కందుల దుర్గేష్‌ : పర్యాటకం, సాంస్కృతిక శాఖలు

గుమ్మడి సంధ్యారాణి : స్త్రీ, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖలు

బీసీ జనార్థన్‌ : రహదారులు, భవనాల శాఖలు

టీజీ భరత్‌: పరిశ్రమల శాఖ

ఎస్‌.సవిత : బీసీ సంక్షేమం, హ్యాండ్లూమ్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌ శాఖలు కేటాయించారు.