కాసేపట్లో వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనకు చంద్రబాబు

సీఎం చంద్రబాబు ఈరోజు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు. తొలుత ఏలూరు జిల్లా కైకలూరులోని వరద ప్రభావిత ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలిస్తారు. అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడు మండలంలోని ఉప్పుటేరు ప్రాంతాన్ని పరిశీలించి రైతులతో సమావేశమవుతారు. ఆ తర్వాత కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలోని రాజుపాలెంలో పొలాలను పరిశీలిస్తారు. సాయంత్రం తిరిగి వెలగపూడి చేరుకుంటారు.