వీఎన్‌ భరత్‌రెడ్డికి సీఎం చంద్రబాబు షాక్

chandrababu public meeting in Anakapalle District Madugula

సీఎం గా బాధ్యతలు చేపట్టిన సీఎం చంద్రబాబు..గత ప్రభుత్వం లో జగన్ కు కీలకంగా వ్యహరించిన వారికీ వరుస షాకులు ఇస్తున్నారు. ఇప్పటికే పలువురు అధికారాల ఫై వేటు వేసిన బాబు..తాజాగా వీఎన్‌ భరత్‌రెడ్డికి షాక్ ఇచ్చారు. AP ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ MD పదవి నుంచి ఆయన్ను తొలగించారు. భరత్‌రెడ్డి తీరుపై కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి రామ్మోహన్‌నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసారు.

పౌర విమానయాన శాఖలో గత 5ఏళ్లలో జరిగిన అవినీతిని బయటపెడుతానన్నారు. చంద్రబాబును ముప్పు తిప్పలు పెట్టిన భరత్ రెడ్డిని వదిలేది లేదని స్పష్టం చేశారు. బాబు బెయిల్ పై బయటకు వచ్చిన తరువాత ఆయన హెలికాప్టర్ ల్యాండ్‌ కాకుండా ఇబ్బంది పెట్టాడని ఫైర్ అయ్యారు. జగన్‌కు వీరవిధేయత చూపిన భరత్ రెడ్డి బట్టలూడదీస్తానని రామ్మోహన్ నాయుడు అన్నట్లు సమాచారం.