chandra babu

ఏపీలో మరో హైటెక్ సిటీకి చంద్రబాబు సన్నాహాలు?

ఒకప్పుడు హైదరాబాద్ నగరాన్ని ఐటీ కంపెనీలకు కేంద్ర బిందువుగా మారటానికి సీఎం చంద్రబాబు చేసిన కృషి సంగతి అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం ఏపీ-తెలంగాణ విడిపోయిన తర్వాత మరో హైటెక్ సిటీని ఏపీలో నిర్మించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ సర్కార్ విశాఖ సమీపంలో డేటా సిటీ, హౌసింగ్ డేటా సెంటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్‌లను అభివృద్ధి చేయాలని చూస్తోంది. ప్రస్తుతం విశాఖకు సమీపంలో అభివృద్ధి చేస్తున్న డేటా సిటీ రానున్న కాలంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనకు దోహదపడుతుందని తెలుస్తోంది. గతంలో హైదరాబాదులో హైటెక్ సిటీని నిర్మించిన అనుభవంతో దానిని తిరిగి ఇక్కడ అనుకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మెగా ప్రాజెక్టులో గూగుల్, టీసీఎస్ ముఖ్యమైన భాగస్వాములుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఐటీ మంత్రి లోకేష్ ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు తెలుస్తోంది.

ఇదే క్రమంలో ఇటీవలి దావోస్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్ తో భేటీ అయ్యారు. ఈ క్రమంలో విశాఖలో డిజైన్ సెంటర్ ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని కోరారు. ఇక్కడ సర్వర్లలో ఉపయోగించే చిప్స్ తయారీకి ఉన్న అవకాశాన్ని పరిశీలించమన్నారు. అలాగే సర్వర్ల సర్వీసింగ్ కోసం కీలక కేంద్రంగా ఏపీని పరిగణించాలని కోరారు. ఇప్పటికే గూగుల్ క్లౌడ్ తన డిజైన సెంటర్లను దిల్లీ, ముంబైలలో ఏర్పాటు చేసిన తరుణంలో ఈ చర్చలు వచ్చాయి. అలాగే విశాఖలో డేటా సిటీ ఏర్పాటుకు గూగుల్ అవగాహన ఒప్పందంపై సంతకం చేసిన సంగతి తెలిసిందే. ఇదే ప్రణాళికపై ఐటీ మంత్రి నారా లోకేష్ కొన్ని వారాల ముందు మాట్లాడిన సంగతి తెలిసిందే. విశాఖపట్నంను ప్రపంచంలోనే డేటా హబ్‌గా మార్చడానికి రాష్ట్రం కట్టుబడి ఉందని ఆయన వెల్లడించారు. దీనికి సంబంధించి విశాఖ మోదీ పర్యటన సమయంలో పునాది కూడా వేశారు. ఈ ప్రాజెక్టు విలువ దాదాపు రూ.2 లక్షల కోట్లుగా అంచనా వేయబడింది.ఆధునిక సాంకేతికత వినియోగంలో ఎప్పుడూ ముందుండే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.

శనివారం వినూత్నంగా ప్రెస్‌మీట్ నిర్వహించి మరోసారి తాను హైటెక్ సీఎంను అని నిరూపించుకున్నారు. కెమెరామెన్ అవసరం లేకుండా కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో చంద్రబాబు ప్రెస్‌మీట్‌ నిర్వహించారు.వీడియోగ్రాఫర్లు, కెమెరామెన్లు లేకుండానే పూర్తిగా ఏఐతో పనిచేసే వ్యవస్థను సీఎం వినియోగించారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో నాలుగు కెమెరాలతో మల్టీవీడియో కెమెరా వ్యవస్థ ఏర్పాటుచేసి దీనిద్వారా లైవ్‌ కవరేజీ అందించడం గమనార్హం.

Related Posts
తల్లి, చెల్లి కలిసి కన్నీళ్లతో జగన్ కు రాసిన లేఖను విడుదల చేసిన టీడీపీ
sharmila letter

వైస్సార్ కుటుంబంలో ఆస్తుల గొడవలు నడుస్తున్నాయనే సంగతి తెలిసిందే. షర్మిల కు రావాల్సిన ఆస్తులఫై జగన్ కన్నేశాడని..అవి తనకు దక్కకుండా చేస్తున్నాడని పరోక్షంగా షర్మిల ఆరోపిస్తునే ఉంది. Read more

త్వరలోనే టీచర్ పోస్టులకు నోటిఫికేషన్: చంద్రబాబు

అమరావతి: సీఎం చంద్రబాబు ఎన్డీయే కూటమి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా సీఎం మాట్లాడుతూ..రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల విజయానికి ఎన్డీయే పక్షాలు Read more

మాజీ మంత్రి రోజాకు షర్మిల కౌంటర్‌..
roja sharmila

ట్విట్టర్ వేదికగా ‘వైఎస్ షర్మిల .. మీకు తెలుగు అర్థం కాదా? ఇంగ్లిష్ అర్థం కాదా? నిన్న మీ అన్న‌ రెండు భాషల్లో సెకీతో ఒప్పందం అంశానికి Read more

రోజా కూతురు ర్యాంప్ వాక్ పిక్ వైరల్
Roja's daughter Anshu Malik

ఏపీ మాజీ మంత్రి ఆర్కే రోజా కూతురు అన్షు మాలిక తన ప్రతిభతో విభిన్న రంగాల్లో రాణిస్తున్నారు. వెబ్ డెవలపర్‌గా, కంటెంట్ క్రియేటర్‌గా ఇప్పటికే గుర్తింపు పొందిన Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *