Chandrababu performs Bhoomi Puja for construction of house in Amaravati

CM Chandrababu : అమరావతిలో ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేసిన చంద్రబాబు

CM Chandrababu : రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఇంటి నిర్మాణ పనులకు బుధవారం శంకుస్థాపన చేశారు. కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వెల‌గ‌పూడి సచివాలయం వెనక E9 రహదారి పక్కనే ఇంటి నిర్మాణం చేపట్టారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేశ్‌ , బ్రాహ్మణి, దేవాంశ్‌ పాల్గొన్నారు.

Advertisements
అమరావతిలో ఇంటి నిర్మాణానికి భూమిపూజ

ఇటీవలే ప్లాట్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ

గత ఏడాది డిసెంబరులో వెలగపూడి రెవెన్యూ పరిధిలో 5 ఎకరాల విస్తీర్ణంలోని నివాస ప్లాట్‌ను ఇదే గ్రామానికి చెందిన రైతు కుటుంబం నుంచి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇటీవలే ప్లాట్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయింది. ఇంటిని 1,455 చ.గజాల విస్తీర్ణంలో జి ప్లస్‌ 1లో నిర్మించనున్నారు. పనులు పూర్తి చేసి ఏడాదిలోపు గృహప్రవేశం చేయాలని భావిస్తున్నారు.

కొన్నాళ్లు హైదరాబాద్‌లో నివాసం

రాజ‌ధానిగా అమరావతిని ప్రకటించిన చంద్రబాబు నాయుడు ఇప్పటివరకు ఆ ప్రాంతంలో సొంతిల్లు లేదు. విభజన తరువాత కొన్నాళ్లు హైదరాబాద్‌లో నివాసం ఉన్న చంద్రబాబు అనంతరం కరకట్ట ఒడ్డున అద్దెకు నివసిస్తున్న విషయం తెలిసిందే. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని నిర్మాణంపై చంద్రబాబు దృష్టి సారించారు. 2019 వరకు భూసేకరణ, డిజైన్లు, నిర్మాణాలు కొంత చేపట్టగా ఇప్పుడు వాటిపై పూర్తి దృష్టిపెట్టారు. ఈ క్రమంలోనే తన సొంత ఇంటిపై దృష్టి సారించారు.

Read Also: 11న ఒంటిమిట్టకు చంద్రబాబు దంపతులు

Related Posts
పర్యాటకంలో 20 శాతం వృద్ధి ఉండాలి – సీఎం చంద్రబాబు
ఏపీ మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్

పర్యాటక రంగంలో కనీసం 20 శాతం వృద్ధి ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగ అభివృద్ధికి కొత్త దిశగా ముందడుగు వేయాలని సీఎం చంద్రబాబు అధికారులు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక Read more

Supreme Court : చెట్లను నరకడం మనుషుల్ని చంపడం కన్నా ఘోరం: సుప్రీంకోర్టు
Cutting down trees is worse than killing people.. Supreme Court

Supreme Court: పర్యావరణాన్ని తమ కళ్లెదుటే నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని.. ఇలాంటి చర్యలను అడ్డుకట్ట ఎలా వేయాలో తమకు బాగా తెలుసని దేశ సర్వోన్నత న్యాయస్థానం Read more

కృష్ణా నది నీటిపై సీఎం డిమాండ్
కృష్ణా నది నీటిపై సీఎం డిమాండ్

అంతర్ రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం, 1956 లోని సెక్షన్ 3 కింద కృష్ణా నది నీటిని న్యాయబద్ధంగా కేటాయించడానికి కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్-II Read more

Telangana Budget 2025-26 : శాఖల వారిగా కేటాయింపులు ఇలా !
Telangana Budget 2025 26

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్ కు ఆమోదం తెలిపింది. అనంతరం, అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×