Chandrababu pays tribute to Bharat Ratna Atal Bihari Vajpayee on his centenary

భారతజాతి గర్వించదగిన నేత వాజ్ పేయి : చంద్రబాబు

న్యూఢిల్లీ: దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి సందర్బంగా ఏపీ సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. “భారతజాతి గర్వించదగిన నేత, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి శతజయంతి సందర్భంగా ఘననివాళి అర్పిస్తున్నాను. దేశగతిని మార్చిన వాజ్ పేయి దూరదృష్టి కారణంగానే నేడు మన దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నది. సగర్వంగా తలెత్తుకు నిలబడుతున్నది.

‘నేషన్ ఫస్ట్’ అని ఎప్పుడూ భావించే ఆయనతో కలిసి పనిచేసిన అనుభూతి నాకు చిరకాలం గుర్తుండిపోతుంది. దేశం గురించి ఆయన ఆలోచించే తీరు విలక్షణమైనది. దానికి ఆధునికత, సాంకేతికత జోడించాలని సూచించినప్పుడు, సంస్కరణల గురించి ప్రతిపాదనలు చేసినప్పుడు ఆయన స్పందించిన తీరు నేను ఎన్నటికీ మరచిపోలేను. రాజనీతిజ్ఞులు, ప్రాత:స్మరణీయులు భారతదేశ ముద్దుబిడ్డ అటల్ జీకి ఘన నివాళి” అని ఎక్స్‌లో చంద్రబాబు పోస్ట్ చేశారు.

ఏపీ సీఎం చంద్రబాబు ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తున్నారు. మంగళవారం రాత్రి ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు నేటి ఉదయం వాజపేయి శత జయంతి కార్యక్రమంలో పాల్గొంటారు. విజయ్‌ఘాట్‌లోని వాజపేయి మెమోరియల్‌ వద్ద చంద్రబాబు నివాళులు అర్పిస్తారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో బుధవారం మధ్యాహ్నం జరగనున్న ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంల సమావేశంలో ఆయన పాల్గొంటారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో చంద్రబాబు భేటీపై ఇంకా స్పష్టత రాలేదు.

Related Posts
నేడు కడప జిల్లాలో జగన్‌ పర్యటన
Jagan visit to Kadapa district today

అమరావతి: నేడు కడప జిల్లాకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రానున్నారు. ఈ మేరకు ఆయన నాలుగు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. Read more

రైతులపై టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి వివాదాస్పద వ్యాఖ్యలు
mla kolikipudi srinivasa ra 1

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనపై వస్తున్న లైంగిక ఆరోపణలపై విచారణ జరపాలంటూ ఇటీవల ఆయన దీక్ష చేపట్టారు. ఆ Read more

నేడు పల్నాడుకు సీఎం చంద్రబాబు పర్యటన
Chandrababu's visit to tirupathi from today

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నేడు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా నరసరావుపేట నియోజకవర్గం యలమందల గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. పార్టీ Read more

ర్యాగింగ్ ఘటనపై సమంత, కీర్తి సురేశ్ స్పందించారు
ర్యాగింగ్ ఘటనపై సమంత, కీర్తి సురేశ్ స్పందించారు

సమంత, గతంలో సినిమాల విషయంలో బిజీగా ఉండగా, ఇప్పుడు మరింత సెలెక్టివ్‌గా ఎంపిక చేస్తున్నది. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండి తన Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *