సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు

ఏపీ ప్రత్యేక రాష్ట్ర రెండోసారి సీఎం గా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసారు. మొన్నటి వరకు మూడు సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సీఎం గా ఉన్న చరిత్రను తిరగరాస్తూ తాజాగా నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఏపీ ముఖ్యమంత్రిగా జూన్ 12 ఉదయం 11.27 నిమిషాలకు సింహలగ్నంలో బాధ్యతలు చేపట్టారు.

నారా చంద్రబాబు నాయుడు అనే… అంటూ బాబు ప్రమాణం కొనసాగింది. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా… రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికి న్యాయం చేకూర్చుతానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అంటూ ప్రమాణం ఆచరించారు. అనంతరం, చంద్రబాబును హత్తుకున్న ప్రధాని మోడీ అభినందించారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ తదితరులు చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు.