Chandrababu Naidu is the richest Chief Minister in the country

దేశంలో సంపన్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు

న్యూఢిల్లీ: దేశంలోనే ధనిక సీఎంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలిచారు. ఈ జాబితాలో పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ చివరి స్థానంలో నిలిచారు. అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ సోమవారం విడుదల చేసిన వివరాల ప్రకారం.. దేశంలో సంపన్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నెంబర్ వన్‌గా నిలిచారు. ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబం ఆస్తుల విలువ రూ.931 కోట్లుండగా, అప్పులు రూ.10 కోట్లు ఉన్నాయి. రూ.15 లక్షల ఆస్తులతో వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చివరి స్థానంలో నిలిచారు.

దేశంలో టాప్ 3 సంపన్న ముఖ్యమంత్రులు వీరే..

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్‌ వివరాల ప్రకారం.. ఏడీఆర్ ఈ రిపోర్ట్ తయారుచేసింది. మొత్తంగా చంద్రబాబు ఫ్యామిలీ ఆస్తులు రూ. 931 కోట్లతో ఏపీ సీఎం సంపన్న ముఖ్యమంత్రిగా నిలిచారు. చంద్రబాబు పేరిట రూ.36 కోట్ల ఆస్తులున్నాయి. ఆయన సతీమణి భువనేశ్వరి పేరిట రూ.895 కోట్ల ఆస్తి ఉన్నట్లు అఫిడవిట్‌లో చంద్రబాబు పేర్కొన్నారు. సంపన్న ముఖ్యమంత్రుల్లో అరుణాచల్‌ ప్రదేశ్ సీఎం పెమా ఖండూ రెండో స్థానంలో ఉన్నారు. పెమా ఖండూ ఆస్తుల విలువ రూ.332 కోట్లు కాగా, ఆయనకు భారీ స్థాయిలో రూ.180 కోట్ల అప్పులున్నాయి. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రూ.51 కోట్ల ఆస్తులతో మూడో స్థానంలో నిలిచారు. సిద్ధరామయ్యకు రూ.23 కోట్ల అప్పులున్నాయి. 30 కోట్ల ఆస్తులతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 7వ స్థానంలో నిలిచారు. ఆయన ఆదాయం రూ.13 లక్షలు కాగా, అప్పులు 1.3 కోట్లు ఉన్నాయి.

దేశంలో బీద ముఖ్యమంత్రులు వీరే..

రూ.15 లక్షల ఆస్తులతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ దేశంలో పేద సీఎంగా నిలిచారు. జమ్మూ కశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా రూ.55 లక్షల ఆస్తులతో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచారు. కేరళ సీఎం పినరయి విజయన్‌ రూ.1.18 కోట్ల ఆస్తులతో చివరి నుంచి మూడో స్థానంలో నిలిచారు.

బిలియనీర్లుగా ఇద్దరు ముఖ్యమంత్రులు..

దేశంలోని మొత్తం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సీఎంల సరాసరి ఆస్తి విలువ రూ.52.59 కోట్లుగా ఉందని ఏడీఆర్ పేర్కొంది. ఓవరాల్‌గా 31 మంది సీఎంల మొత్తం ఆస్తి రూ.1,630 కోట్లు ఉంది. మొత్తం సీఎంల ఏడాది సగటు ఆదాయం రూ.13,64,310 (13 లక్షల 64 వేల 3 వందల పది)గా ఉంది. 31 మంది ముఖ్యమంత్రుల్లో ఇద్దరు మాత్రమే బిలియనర్లుగా ఉన్నారు. ముగ్గురు సీఎంల ఆస్తులు రూ.50 కోట్ల కన్నా ఎక్కువగా ఉండగా, 9 మంది సీఎంల ఆస్తులు విలువ రూ.11 నుంచి రూ.50 కోట్ల మధ్య ఉన్నట్లు ఏడీఆర్ రిపోర్ట్ పేర్కొంది. ఇద్దరు సీఎంలు 70 నుంచి 80 ఏళ్ల మధ్య వయసు వారు కాగా, 12 మంది ముఖ్యమంత్రుల వయసు 51 నుంచి 60 మధ్యలో ఉంది. 31 మంది సీఎంలలో 10 మంది ముఖ్యమంత్రుల విద్యార్హత గ్రాడ్యుయేషన్. ఇద్దరు సీఎంలు డాక్టరేట్ పొందారు.

ఇకపోతే..ఏడీఆర్ రిపోర్ట్ ప్రకారం.. 13 మంది ముఖ్యమంత్రుల మీద క్రిమినల్ కేసులున్నాయి. అందులో 10 మంది సీఎంల మీద కిడ్నాప్, లంచం, హత్యాయత్నం లాంటి క్రిమినల్ కేసులు ఉన్నాయి. కాగా, దేశంలోనే అత్యధిక కేసులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఉన్నాయి. ఈ కాంగ్రెస్ సీఎం మీద 89 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మీద 13 కేసులతో నాలుగో స్థానంలో ఉన్నారు. దేశంలో కేవలం ఇద్దరు మహిళా సీఎంలు ఢిల్లీ – అతిషి, పశ్చిమ బెంగాల్ నుంచి మమతా బెనర్జీ ఉన్నారు.

Related Posts
ఢిల్లీ స్కూళ్లకు ఆగని బాంబు బెదిరింపులు..
Non stop bomb threats to Delhi schools

న్యూఢిల్లీ: ఢిల్లీలో పాఠశాలలకు బాంబు బెదిరింపులు కొనసాగుతూనే ఉన్నాయి. శుక్రవారం ఉదయం ఈస్ట్‌ ఢిల్లీ, నోయిడాలోని పలు స్కూళ్లకు బెదిరింపులు వచ్చాయి. ఈ-మెయిల్‌ ద్వారా వార్నింగ్‌ రావడంతో Read more

నేడు కొమురవెల్లి మల్లన్న కళ్యాణం
Lord Mallana Wedding

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి గ్రామంలోని శ్రీ మల్లికార్జునస్వామి దేవాలయంలో నేడు స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరగనుంది. స్వామి కళ్యాణం ఆలయ ప్రాంగణంలోని తోటబావి వద్ద ప్రత్యేకంగా Read more

హర్యానా బీజేపీ చీఫ్ పై అత్యాచారం కేసు
Gang rape case against Haryana BJP chief Mohanlal

చండీగఢ్: హర్యానా బీజేపీ అధ్యక్షుడు మోహన్ లాల్ బడోలీ (61)పై హిమాచల్ ప్రదేశ్‌లో గాయకుడు రాకీ మిట్టల్‌తో పాటు అత్యాచారం కేసు నమోదైంది. సోలన్ జిల్లాలోని టూరిస్ట్ Read more

కేజ్రీవాల్ కారుపై దాడి!
కేజ్రీవాల్ కారుపై దాడి!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలోని కాన్వాయ్‌పై దాడి జరిగిందని ఆ పార్టీ ఆరోపించింది. ఈ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *