జగన్ మరో భారీ షాక్ ఇచ్చిన కూటమి సర్కార్

chandrababu-letter-to-jagan

ఏపీలో అధికారం చేపట్టిన కూటమి సర్కార్…వరుసగా మాజీ సీఎం జగన్ కు షాకులు ఇస్తూ వస్తుంది. గడిచిన ఐదేళ్లలో ప్రజల సొమ్మును కాజేశారని , వేల కోట్ల నిధులను తమ జేబుల్లో వేసుకున్నారని ఆరోపిస్తూ వచ్చిన కూటమి..ఇప్పుడు వాటిని బయటకు తీసే పని మొదలుపెట్టింది. అక్రమ ఆస్తులను బయటకు తీస్తూనే..నోటీసులు జారీ చేస్తూ వస్తుంది. ఇప్పటికి అక్రమంగా నిర్మించిన వైసీపీ కార్యాలయాలను , నిర్మాణాలను కూల్చి వేస్తూ వస్తుంది.

ఇక ఇప్పుడు మరో షాక్ జగన్ కు ఇచ్చేందుకు బాబు సిద్ధం అయ్యారు. పులివెందుల జగనన్న మెగా లేఅవుట్‌ అక్రమాలపై విచారణకు సిద్ధమైంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేశారు. గత ప్రభుత్వం టైమ్‌లో పులివెందులకు 8400 ఇళ్ల మంజూరు చేశారు. అనర్హులను లబ్ధిదారులుగా ఎంపిక చేశారని , ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారని సీఎంకు ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి ఫిర్యాదు చేశారు.

పథకంలో భాగంగా మూడేళ్ల కిందట స్థలాలు మంజూరు చేయగా.. ఇప్పటికీ ఇంకా ఇళ్ల నిర్మాణం పూర్తి కెల్దాని , మూడేళ్లలో కేవలం 99 ఇళ్లు మాత్రమే నిర్మాణం జరిగిందని, రూ.84.70 కోట్ల బిల్లులు చెల్లించింది గృహనిర్మాణ సంస్థ. పులివెందులలో అన్ని చోట్ల ఇళ్ల నిర్మాణాలు ఎక్కడిఅక్కడ నిలిచిపోయాయి అని ఫిర్యాదులో పేర్కోవడం తో వాటిపై వెంటనే విచారణ చేయాలనీ సీఎం ఆదేశించారు. ఈ ఇళ్ల నిర్మాణ పనులు . మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డికి అప్పగించింది గత ప్రభుత్వం. మరి ఈ విచారణ లో ఎలాంటి నిజాలు బయటపడతాయో చూడాలి.