Chandrababu experience is necessary for the state.. Pawan Kalyan

Pawan Kalyan : చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరం: పవన్ కల్యాణ్

Pawan Kalyan : కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పూడిచెర్ల గ్రామంలో రైతు రాజన్న పొలంలో ఫామ్ పాండ్ నిర్మాణ పనులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భూమిపూజ చేశారు. అనంతరం పూడిచెర్లలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన ప్రసంగిస్తూ.. ఏపీ కష్టాల్లో ఉన్న సమయంలో కూటమిని రాష్ట్ర ప్రజలు గెలిపించారని మొత్తం 175 సీట్లలో 164 సీట్లను కట్టబెట్టి ఘన విజయం అందించారని చెప్పారు. కూటమికి 21 ఎంపీ స్థానాలను కట్టబెట్టారని తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళుతున్నామని చెప్పారు. రాష్ట్రం బాగుండాలని చంద్రబాబు కోరుకుంటారని చంద్రబాబే తనకు స్ఫూర్తి అని ఆయన స్ఫూర్తితోనే తాను పని చేస్తున్నానని తెలిపారు.

Advertisements
చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరం

రాయలసీమ రతనాలసీమ కావాలి

చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరమని ఆయన 15 ఏళ్లు సీఎంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. మే నెలలోపు లక్ష 55 వేల నీటి కుంటలు పూర్తి కావాలనేది లక్ష్యంగా పెట్టుకున్నామని వర్షాల సమయంలో ఈ కుంటలన్నీ నిండితే ఒక టీఎంసీ నీళ్లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. శ్రీకృష్ణదేవరాయలు చెప్పినట్టు రాయలసీమ రతనాలసీమ కావాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో పల్లె పండుగ విజయవంతం కావడానికి చంద్రబాబే కారణమని పవన్ కితాబునిచ్చారు. రాయలసీమలో నీటి కష్టాలు ఎక్కువగా ఉండేవని చెప్పారు. భారీ వర్షాలు పడితే నీటి నిల్వ సౌకర్యం రాయలసీమలో లేదని అన్నారు.

రాష్ట్రం బాగుండాలని సీఎం కోరుకుంటున్నారు

రాష్ట్రంలో 52.92 లక్షల కుటుంబాల్లో 97.44 లక్షల మంది ఉపాధి కూలీలకు స్వగ్రామాల్లో ఉపాధి కల్పించామని తెలిపారు. రాష్ట్రం బాగుండాలని ముఖ్యమంత్రి కోరుకుంటున్నారని ఆయనను ప్రేరణగా తీసుకుని తనకు అప్పగించిన శాఖలన్నింటినీ బలోపేతం చేస్తున్నానని చెప్పారు. ఒకేరోజు 13,326 గ్రామసభలు నిర్వహించి అభివృద్ధి కోసం చేపట్టాల్సిన పనుల జాబితాను రూపొందించి ప్రపంచ రికార్డు సాధించామని అన్నారు. గిరిజన గ్రామాల్లో విద్యుత్, తాగునీటితో పాటు మౌలిక వసతులు కల్పించామని తెలిపారు.

Related Posts
దూసుకెళ్తున్న కేజ్రీవాల్!
దూసుకెళ్తున్న కేజ్రీవాల్!

న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజక వర్గంలో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆధిక్యంలో ఉన్నారని సూచిస్తున్నారు. జంగ్‌పురా నియోజక వర్గంలో ఆప్ నేత మనీష్ Read more

పేర్నినాని గోడౌన్ లో భారీ బియ్యం మాయం?
perni nani

వైసీపీ మాజీ మంత్రి పేర్నినాని గోడౌన్ లో భారీ మొత్తంలో బియ్యం మాయం అయినట్లు తెలుస్తోంది. ముందు వెయ్యి బస్తాలు పోయినట్లు, ఆ తర్వాత 3-4 వేల Read more

China : చైనాలో గాలులు, ఇసుక తుపాను..600 పైగా విమాన సర్వీసులు రద్దు
Winds and sandstorms in China... More than 600 flights canceled

China : చైనాలో భీకర గాలులు, ఇసుక తుపాను బీభత్సం సృష్టిస్తోంది. భారీ గాలులతో రాజధాని బీజింగ్‌లో చెట్లు నేలకొరిగాయి. ఈ నేపథ్యంలో చైనా ప్రభుత్వం అప్రమత్తమైంది. Read more

నేటి నుంచి కుప్పంలో చంద్రబాబు పర్యటన
Chandrababu's visit to tirupathi from today

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి నుంచి రెండు రోజుల పాటు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన స్థానిక అభివృద్ధి కార్యక్రమాలు, Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×