పవన్ చేస్తున్న సేవలకు విలువ కట్టలేం – సీఎం చంద్రబాబు

వరద ప్రాంత ప్రజల కోసం భారీ విరాళం ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను సీఎం చంద్రబాబు అభినందించారు. ‘సీఎం సహాయ నిధికి రూ. కోటి, వరద బారిన పడ్డ 400 పంచాయతీలకు రూ.4 కోట్లు, తెలంగాణకు మరో రూ. కోటి ఇవ్వడం పవన్ కళ్యాణ్ విశాల హృదయానికి అద్దం పడుతోంది. ఆయన సమాజంలో ఎందరికో స్ఫూర్తి. ప్రజలకు ఆయన చేస్తున్న సేవలకు విలువ కట్టలేం. ఆయన కురిపిస్తున్న వాత్సల్యానికి ఏదీ సరితూగదు’ అని ట్వీట్ చేశారు.

ఇదిలా ఉంటె విజయవాడ వరదల నేపధ్యంలో వరద సహాయక చర్యలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశంసలు కురింపించారు. ఇటు పవన్ కళ్యాణ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు చంద్రబాబును ప్రశంసిస్తే .. పవన్ కళ్యాణ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మెచ్చుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. విజయవాడ వరదలకు కారణమైన బుడమేరు గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్..తెలంగాణలో ఆక్రమణలు కూలుస్తున్న హైడ్రా గురించి ప్రస్తావించారు. రేవంత్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలను పరిరక్షించడంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం హైడ్రా తీసుకురావడం అభినందనీయమని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇలా ఒకరిపై ఒకరు ప్రశంసలు , అభినందనలు తెలియజేసుకుంటుండడం ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.