Chandrababu cabinet meeting 585x439 1

Chandrababu: ఇసుక విధానంపై చంద్రబాబు సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నూతన ఇసుక విధానంపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సోమవారం జరిగిన సమీక్షలో, ఉచిత ఇసుక విధానం సరైన రీతిలో అమలు జరగాలని, ఇసుకను పొరుగు రాష్ట్రాలకు అక్రమంగా తరలించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇసుక సులభంగా ప్రజలకు అందుబాటులో ఉండేందుకు సీనరేజ్ విధానాన్ని రద్దు చేసినట్టు సీఎం తెలిపారు.

తమిళనాడు, తెలంగాణ, కర్ణాటకకు చెందిన ప్రధాన నగరాలు చెన్నై, హైదరాబాద్, బెంగళూరుకు ఏపీ నుంచి ఇసుక అక్రమంగా తరలింపులు జరుగుతున్నాయని గుర్తించిన సీఎం, ఈ మార్గాల్లో ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేయాలని సూచించారు. నిబంధనలను ఉల్లంఘిస్తే, సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించారు.

ఇసుక అక్రమ తవ్వకాలపై ఫిర్యాదులు స్వీకరించే సరికొత్త ఫిర్యాదు వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించిన సీఎం, గ్రామ పంచాయతీల పరిధిలో సొంత అవసరాల కోసం ట్రాక్టర్ ద్వారా ఇసుక తీసుకెళ్లేందుకు అనుమతులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇసుక తీసుకెళ్లేవారు గ్రామ, వార్డు సచివాలయాల్లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సీఎం పేర్కొన్నారు. ఇసుక తవ్వకాలు, లోడింగ్ నిర్వహణను ప్రైవేటు వ్యక్తులపై బాధ్యతగా అప్పగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిపారు

Related Posts
ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబు: జగన్
ys jagan

ఏపీ ప్రజలను సీఎం చంద్రబాబు మోసం చేస్తున్నారని మాజీ సీఎం జగన్ ఆరోపించారు.చంద్రబాబును విమర్శిస్తూ ఎక్స్ లో జగన్ సుదీర్ఘ పోస్టు పెట్టారు. ఏపీలో కూటమి ప్రభుత్వం Read more

మరో 5 నెలల్లో అందుబాటులోకి విజయవాడ వెస్ట్ బైపాస్
Vijayawada West Bypass unde

విజయవాడ నగరంలో ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు దశాబ్దాలుగా ప్రతిపాదనలో ఉన్న వెస్ట్ బైపాస్ రహదారి పూర్తి కావొస్తుంది. ప్రస్తుతం 95% పనులు పూర్తవగా, మిగిలిన పనులు త్వరలోనే Read more

ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
vijayasai reddy

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నాయకులపై వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కాకినాడ సీ పోర్టు లిమిటెడ్ , కాకినాడ సెజ్‌లోని వాటాలను Read more

ఏపీకి ‘దానా’ తుఫాను ముప్పు
AP Cyclone Dana

బంగాళాఖాతంలో 'దానా' తుఫాను ముప్పు పొంచి ఉండటంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలకు IMD హెచ్చరికలు జారీ చేసింది. వాయుగుండం ఇవాళ తుఫానుగా, రేపు తీవ్ర Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *