Chacko: అరెస్టైన కొన్ని గంటల్లోనే మలయాళ స్టార్‌కు బెయిల్ మంజూరు

Chacko: అరెస్టైన కొన్ని గంటల్లోనే మలయాళ స్టార్‌కు బెయిల్ మంజూరు

డ్రగ్స్ కేసులో షైన్ టామ్ చాకో అరెస్ట్ – బెయిల్ తో ఊరట

మలయాళ సినీ పరిశ్రమలో సంచలనం రేపిన డ్రగ్స్ కేసులో ప్రముఖ నటుడు షైన్ టామ్ చాకో అరెస్ట్ అయ్యాడు. అయితే, అరెస్ట్ అయిన కొద్ది గంటల్లోనే ఆయన బెయిల్‌పై విడుదల అయ్యాడు. వివరాల్లోకి వెళ్తే, ఇటీవల సహనటి విన్సీ తనపై అసభ్యంగా ప్రవర్తించారని షైన్ టామ్ చాకోపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. డ్రగ్స్ మత్తులో తన పట్ల దురుసుగా వ్యవహరించాడని విన్సీ ఆరోపణలు చేయడం, షైన్ టామ్ చాకో గతంలోనూ వివాదాస్పద ఘటనలతో వార్తల్లో నిలవడం ఈ ఘటనకు మరింత బరువు చేకూర్చాయి.

Advertisements

హోటల్‌పై పోలీసుల రైడ్ – పారిపోతున్న షైన్ టామ్

ఈ ఆరోపణల నేపథ్యంలో పోలీసులు కొచ్చి నగరంలోని కలూర్ ప్రాంతంలో ఉన్న స్టార్ హోటల్‌పై తనిఖీకి వెళ్లారు. సమాచారం ప్రకారం, ఓ ప్రముఖ డ్రగ్స్ నిందితుడిని పట్టుకునే ఉద్దేశ్యంతో పోలీసులు అక్కడికి వెళ్లగా, అక్కడ షైన్ టామ్ చాకో కూడా ఉండటం అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది. షైన్ టామ్ చాకో, పోలీసులు వస్తున్నారన్న సమాచారం అందుకున్న వెంటనే హోటల్ గదిలోని కిటికీ ద్వారా బయటకు దూకి పారిపోయే ప్రయత్నం చేశారు. హోటల్ ప్రాంగణంలో అమర్చిన సీసీ టీవీ కెమెరాల్లో చాకో పారిపోతున్న దృశ్యాలు స్పష్టంగా రికార్డు అయ్యాయి. ఇది కేసుకు కీలక ఆధారంగా మారింది.

అరెస్ట్, విచారణ, బెయిల్

తర్వాత వెంటనే పోలీసులు షైన్ టామ్ చాకోను అదుపులోకి తీసుకుని, విచారణ చేపట్టారు. విచారణలో చాకో తనకు డ్రగ్స్ నిందితుడితో పరిచయం ఉందని అంగీకరించినట్లు సమాచారం. పోలీసులు చాకోను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా, కోర్టు ఆయనకు వెంటనే బెయిల్ మంజూరు చేసింది. దాంతో షైన్ టామ్ చాకో మళ్లీ బయటకు వచ్చారు. అయితే, పోలీసులు ముందస్తుగా షైన్ టామ్ నుండి శరీర నమూనాలను సేకరించి డ్రగ్స్ టెస్టింగ్‌ కోసం ల్యాబ్‌కు పంపారు. అందుతున్న సమాచారం ప్రకారం, టెస్టు నివేదిక ఆధారంగా షైన్ టామ్ డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనే అంశంపై తుది స్పష్టత రానుంది.

కేసు పై మరిన్ని ప్రశ్నలు

ఈ నేపథ్యంలో, సినీ పరిశ్రమలో డ్రగ్స్ సంబంధిత అంశాలపై మరింత చర్చ మొదలైంది. ఇప్పటికే మలయాళ చిత్రసీమలో కొందరు నటులు, నటీమణులు డ్రగ్స్ వ్యవహారంలో ఇరుక్కొన్న సంగతి తెలిసిందే. షైన్ టామ్ చాకోపై వచ్చిన ఆరోపణలు, తాజా అరెస్ట్ ఘటన మరొకసారి పరిశ్రమలో డ్రగ్స్ మాయాజాలంపై దృష్టి సారించించింది. ఇక షైన్ టామ్ చాకో డ్రగ్స్ టెస్టు నివేదిక ఎలా వస్తుందో, దీనికి అనుసంధానంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.

READ ALSO: Lavanya: రాజ్ తరుణ్‌, శేఖర్ బాషాలపై లావణ్య తీవ్ర ఆరోపణలు

Related Posts
Chiranjeevi NTR: ఉగాది సందర్బంగా చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు
Chiranjeevi NTR: ఉగాది సందర్బంగా చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు

ఉగాది పండుగ: తెలుగు రాష్ట్రాల్లో దసరా తరహా వేడుకలు ఉగాది, తెలుగు సంవత్సరపు తొలి పండుగగా ఈ రోజున తెలుగు రాష్ట్రాల్లో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఈ పండుగను Read more

Cinema :27న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ఎల్‌2: ఎంపురాన్
Cinema :27న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ఎల్‌2 ఎంపురాన్

సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'ఎల్‌2: ఎంపురాన్'. గతంలో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన 'లూసిఫర్' కు Read more

Tamanna: తమన్నా ‘నషా’ సాంగ్​ పాటకు ఎన్ని కోట్లు తీసుకుందో తెలుసా?
Tamanna: తమన్నా 'నషా' సాంగ్​ పాటకు ఎన్ని కోట్లు తీసుకుందో తెలుసా?

అన్ని భాషల సినిమాల్లోనూ ఐటెం సాంగ్ అంటే మేకర్స్‌‌కి ముందుగా తమన్నానే గుర్తుకొస్తుంది. రజినీకాంత్ ‘జైలర్’,, బాలీవుడ్‌ మూవీ ‘స్త్రీ 2’లో తమన్నా చేసిన ఐటెం సాంగ్స్‌ Read more

ఇప్పటివరకు పుష్ప-2 కు వచ్చిన వసూళ్లు.
ఇప్పటివరకు పుష్ప-2 కు వచ్చిన వసూళ్లు.

పుష్ప-2 ది రూల్ ఇండస్ట్రీ హిట్ బాక్సాఫీస్ రికార్డులు సృష్టించిన చిత్రం.అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ పుష్ప-2 ది రూల్ Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×