ప్రకాశం బ్యారేజీని సందర్శించిన కేంద్ర బృందం

boat hit the Prakasam barrage gate.. Damaged gates?
Central team visited Prakasam Barrage

అమరావతి: ప్రకాశం బ్యారేజీని కేంద్ర బృందం సందర్శించింది. భారీ వర్షాలు, వరదల కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నష్టం సంభవించింది. ఇటీవల కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఏపీ, తెలంగాణలలో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈరోజు కేంద్రబృందం బ్యారేజీని పరిశీలించింది.

బ్యారేజీ నీటి ప్రవాహం తదితర విషయాలను జలవనరుల శాఖ అధికారులు కేంద్ర బృందానికి వెల్లడించారు. ఈఎస్‌సీ వెంకటేశ్వర్లు ఇందుకు సంబంధించిన వివరాలను అందించారు. ఈ నెల 1న రికార్డ్ స్థాయిలో 11.43 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందన్నారు. కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో పరిస్థితి, ముంపునకు సంబంధించిన వివరాలను ఈ బృందం దృష్టికి తీసుకువెళ్లారు.

ధవళేశ్వరం వద్ద గోదావరి ప్రవాహం 15.30 అడుగులుగా నమోదైంది. ఇక్కడి నుంచి సముద్రంలోకి 15.24 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇక్కడ రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. కోనసీమలో లంక గ్రామాలు ఇంకా ముంపులోనే ఉండటంతో పడవల ద్వారా రాకపోకలు కొనసాగుతున్నాయి. పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలచిపోయాయి. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.