Central Government has released huge funds to the Telugu States

కేంద్రం గుడ్‌న్యూస్‌.. తెలుగు రాష్ట్రాలకు భారీగా నిధులు విడుదల

తెలుగు రాష్ట్రాలకు కేంద్రప్రభుత్వం శుభవార్త తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో రోడ్ల అభివృద్ధికి కేంద్రం నిధులు కేటాయింపులు చేసింది. ఏపీకి 498 కోట్లు,తెలంగాణకి 516 కోట్ల నిధులు విడుదల చేసింది. ఏపీలో 200.06 కిమీ పొడవైన 13 రాష్ట్ర రహదారులకు కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి నుంచి నిధులు కేటాయించారు. గుంటూరు నల్లపాడు రైల్వే మార్గంలో శంకర్ విలాస్ ఆర్ ఓబీ ని నాలుగు వరుసల నిర్మాణానికి 98 కోట్లు కేటాయింపులు చేశారు.

తెలంగాణలో NH 565లోని నకిరేకల్ – నాగార్జున సాగర్ మధ్య 14 కి.మీ పొడవు, 4-లేన్ బైపాస్ నిర్మాణానికి 516 కోట్లు మంజూరు చేసింది కేంద్రం. బైపాస్ రోడ్డు నిర్మాణంతో నల్గొండ టౌన్ కి ట్రాఫిక్‌ తగ్గనుంది. నకిరేకల్ – నాగార్జున సాగర్ మధ్య పెరగనుంది కనెక్టివిటీ. అటు ఏపీ తెలంగాణ మధ్య కీలకమైన జాతీయ రహదారిగా ఉంది NH 565. తెలంగాణలోని నకిరేకల్ వద్ద NH 65 తో జంక్షన్ నుండి ప్రారంభమై నల్గొండ, మాచర్ల, ఎర్రగొండపాలెం కనిగిరి పట్టణాల గుండా వెళుతోంది NH 565.

Related Posts
తెలంగాణ లో ఐదేళ్లలో 2,722 కి.మీ హైవేల నిర్మాణం పూర్తి – కేంద్రం
telangana Highway roads

తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ఈ క్రమంలో గత ఐదేళ్లలో 2,722 కి.మీ మేర హైవేలను నిర్మించామని కేంద్ర మంత్రి నితిన్ Read more

మహిళా వ్యవస్థాపక(Entrepreneurship) దినోత్సవం..
Women Entrepreneurship Day 2

ప్రపంచవ్యాప్తంగా మహిళల శక్తివంతమైన పాత్ర మరియు ఆత్మనిర్భరత సమాజంలో ప్రధాన మార్పులను తీసుకువస్తోంది. మహిళా వ్యవస్థాపక దినోత్సవం (Women Entrepreneurship Day) ప్రతి సంవత్సరం నవంబర్ 19న Read more

నేటి నుంచి తిరుమలలో బ్రహ్మోత్సవాలు..శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం
CBN tirumala

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలు తిరుమలలో నేటి నుంచి అంగరంగ వైభవంగా జరగనున్నాయి. సాయంత్రం 5 .45 గంటలకు మీనలగ్నంలో ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ నిర్వహించే ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు Read more

75వ రాజ్యాంగ వార్షికోత్సవం గురించి మోదీ ప్రసంగం – దేశ భవిష్యత్తు పై కీలక వ్యాఖ్యలు!
Maharashtra and Jharkhand assembly elections. PM Modis appeal to the voters

ప్రధానమంత్రి నరేంద్రమోదీ 75వ రాజ్యాంగ వార్షికోత్సవం సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటులో తన ప్రసంగంలో.. "ఈ పార్లమెంటు సెషన్ అత్యంత ప్రత్యేకమైనది. 75 సంవత్సరాల క్షేత్రంలో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *