Center has ordered an inquiry into 'Sheesh Mahal'

‘శీష్ మహల్‌’పై విచారణకు ఆదేశించిన కేంద్రం

కేజ్రీవాల్‌ను వెంటాడుతున్న కష్టాలు

న్యూఢిల్లీ: ఇప్పటికే ఢిల్లీలో అధికారం కోల్పోయి.. నిరాశలో ఉన్న కేజ్రీవాల్‌కు కేంద్రం షాకిచ్చింది. ‘శీష్ మహల్’ అక్రమాలపై దర్యాప్తునకు కేంద్రం ఆదేశించింది. బంగ్లా పునరుద్ధరణ పనుల్లో అక్రమాలు జరిగాయాంటూ బీజేపీ ఎమ్మెల్యే విజేంద్ర గుప్తా లెఫ్టినెంట్ గవర్నర్ వీకే.సక్సేనాకు ఫిర్యాదు చేశారు. ఎల్జీ ఆదేశాలతో ఫిబ్రవరి 13న కేంద్ర ప్రజా పనుల శాఖ నివేదిక సమర్పించింది. తాజాగా పునరుద్ధరణలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు చేయాలంటూ కేంద్రం ఆదేశించింది. ప్రభుత్వ ఖజానాను విలాసవంతమైన వస్తువులకు ఖర్చు చేశారని బీజేపీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ దర్యాప్తుకు ఆదేశించింది.

‘శీష్ మహల్‌’ విచారణకు ఆదేశించిన కేంద్రం

ఖజానాను వృధా చేశారని బీజేపీ ఆరోణలు

కేజ్రీవాల్.. ఢిల్లీలోని 6 ఫ్లాగ్‌స్టాప్ రోడ్‌లోని బంగ్లాలో 2015 నుంచి 2024 వరకు నివాసం ఉన్నారు. ఆ సమయంలో బంగ్లా పునర్ నిర్మాణ పనుల్లో ప్రభుత్వ ఖజానాను వృధా చేశారని బీజేపీ ఆరోపించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రధాని మోడీ దగ్గర నుంచి బీజేపీ అగ్ర నేతలంతా ఈ విషయాన్ని ప్రధానంగా హైలెట్ చేశారు. ‘శీష్ మహల్’ అంటూ ఆరోపణలు గుప్పించింది. మొత్తానికి ఆప్ అధికారాన్ని కూడా కోల్పోయింది. ఇక 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఆప్ హయాంలో జరిగిన అవకతవకలపై కేంద్రం దృష్టి సారించింది.

మహిళలకు ఛాన్స్ ఉండొచ్చని ఊహాగానాలు

కాగా, ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. బీజేపీ 48, ఆప్ 22 స్థానాలు గెలుచుకుంది. 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇక ముఖ్యమంత్రి పేరును ఇంకా ప్రకటించలేదు. ఇందుకోసం అధిష్టానం తీవ్ర కసరత్తు చేస్తోంది. మహిళలకు ఛాన్స్ ఉండొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇంకోవైపు కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేష్ వర్మకు ముఖ్యమంత్రిగా అవకాశం ఉండే ఛాన్సుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే కొత్త ముఖ్యమంత్రి ‘శీష్ మహల్’ ఉండరని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

Related Posts
ప్రపంచ బ్యాంక్ చీఫ్ జోక్: మోదీ, మాక్రాన్‌ల మధ్య స్నేహపూర్వక వాతావరణం
india french

ప్రపంచ బ్యాంక్ చీఫ్ అజయ్ బంగా , బ్రెజిల్‌లో జరిగిన ఒక అంతర్జాతీయ కార్యక్రమంలో ప్రపంచ నాయకులను నవ్వులతో ఆకట్టుకున్నారు. ఆయన "ఒక భారతీయుడి నుండి మరొకరికి" Read more

దేశంలో కాంగ్రెస్‌కు తగ్గుతున్న ఆదరణ!
దేశంలో కాంగ్రెస్‌కు తగ్గుతున్న ఆదరణ!

దేశంలో కాంగ్రెస్‌ పార్టీకి ఆదరణ తగ్గుతోందని ఓ సర్వేలో వెల్లడైంది. గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పుంజుకున్న కాంగ్రెస్‌.. ఆ తర్వాత జరిగిన పలు రాష్ట్రాల Read more

నందిగం సురేశ్ కు ఊరట
Nandigam Suresh surrendered in court

2020లో నమోదైన కేసులో కోర్టు బెయిల్ మంజూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు సత్తెనపల్లి సివిల్ కోర్టులో ఊరట లభించింది. ఆయనపై 2020లో Read more

రైతుల హక్కుల కోసం విజయ
రైతుల హక్కుల కోసం విజయ

ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి వ్యతిరేకంగా గత ఒక సంవత్సరం నుంచి రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెల్సిందే. ఈ ఆందోళనలలో భాగంగా రైతుల సమస్యలకు మద్దతు తెలిపిన Read more