తిరుపతి - కాట్పాడి లైన్ డబ్లింగ్ కు కేంద్రం ఆమోదం

Central Cabinet: తిరుపతి – కాట్పాడి లైన్ డబ్లింగ్ కు కేంద్రం ఆమోదం

కేంద్ర మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. మూడో సారి అధికారం లోకి వచ్చిన తరువాత మోదీ ప్రభుత్వం ఏపీకి సంబంధించి పలు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా జరిగిన మంత్రివర్గ భేటీలో సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న తిరుపతి – కాట్పాడి లైన్ డబ్లింగ్ కు ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా తిరుపతి, శ్రీ కాళహస్తికి వచ్చే ప్రయాణీకులతో పాటుగా విద్య, వైద్య సంస్థలు ఎక్కువగా ఉండటంతో ఈ ప్రాంతానికి లబ్ది కలగనుంది.

Advertisements
తిరుపతి - కాట్పాడి లైన్ డబ్లింగ్ కు కేంద్రం ఆమోదం

రూ.1,332 కోట్లతో డబ్లింగ్‌ పనులకు ఆమోదం
కేంద్రం మంత్రివర్గ భేటీలో తిరుపతి నుంచి కాట్పాడి వరకు రూ.1,332 కోట్లతో డబ్లింగ్‌ పనులకు ఆమోదం లభించింది. ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ద్వారా తిరుపతి, శ్రీకాళహస్తి, చంద్రగిరి కోట క్షేత్రాలకు లక్షల్లో భక్తులు తరలి వస్తారని చెప్పారు. తిరుపతి, వెల్లూరు ప్రాంతాలు వైద్య, విద్య హబ్‌లుగా ఉన్నా యని అన్నారు. దీనితో రాయలసీమ రీజియన్‌కు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. అదే విధం గా ఎలక్ట్రానిక్స్‌, సిమెంట్‌, స్టీల్‌ తయారీ కంపెనీలకు కూడా లబ్ధి పొందుతాయని అశ్వినీ వైష్ణవ్ వివరించారు.
చిత్తూరు, తిరుపతి, వెల్లూరు జిల్లాకు లబ్ధి
తాజాగా ఆమోదం పొందిన ఈ ప్రాజెక్టు ద్వారా చిత్తూరు, తిరుపతి, వెల్లూరు జిల్లాకు లబ్ధి చేకూరు తుందని అశ్వినీ వైష్ణవ్ చెప్పుకొచ్చారు. ఈ ప్రాజెక్టులో 17 మేజర్‌, 327 మైనర్‌ వంతెనలు వస్తున్నాయని చెప్పారు. అదేవిధంగా 7 పైవంతెనలు, 30 అండర్‌ పాస్‌ బ్రిడ్జ్‌లు రానున్నట్లు తెలిపారు. 104 కి.మీ మార్గం రోడ్డుకు బదులు రైలు మార్గానికి రద్దీ మళ్లుతుందని వివరించారు. తద్వారా 20 కోట్ల కిలోల కార్బన్‌డయాక్సైడ్‌ తగ్గుతుందని తెలిపారు.

READ ALSO: New Aadhar App: కొత్త ఆధార్ యాప్ తెచ్చిన కేంద్రం

Related Posts
కేరళ యువతీ మృతికి కారణాలు
కేరళలో యువతీ మృతి: బరువు తగ్గే ప్రయత్నం ప్రాణాలపైకి

కేరళలో 18 ఏళ్ల యువతి శ్రీనంద అనోరెక్సియా నెర్వోసా అనే రుగ్మత కారణంగా ప్రాణాలు కోల్పోయిన సంఘటన అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె దాదాపు 6 Read more

వక్స్ బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం
Union Cabinet2

JPC (జాయింట్ పార్లమెంటరీ కమిటీ) రిపోర్టు ఆధారంగా సవరించిన వక్స్ బిల్లును కేంద్ర క్యాబినెట్ తాజాగా ఆమోదించింది. మార్చి 10నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల రెండో Read more

హైకోర్టు లో పేర్ని నానికి ఊరట
హైకోర్టు లో పేర్ని నానికి ఊరట

ఆంధ్ర ప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని రేషన్ బియ్యం మాయం కేసులో ఆరో నిందితుడిగా (A6) చేర్చబడ్డారు. ఈ కేసులో మొదటి నిందితురాలిగా Read more

Chandrababu Naidu : ముస్లింలతో కలిసి నమాజ్ చేసిన చంద్రబాబు
ముస్లింలతో కలిసి నమాజ్ చేసిన చంద్రబాబు

Chandrababu Naidu : ముస్లింలతో కలిసి నమాజ్ చేసిన చంద్రబాబు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముస్లిం సోదరుల కోసం ప్రత్యేకంగా ఇఫ్తార్ విందును Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×