KU యూనివర్సిటీలో పెను ప్రమాదం తప్పింది..

KU యూనివర్సిటీలో వరుసగా పెను ప్రమాదాలు జరుగుతున్నాయి. వరుసగా సీలింగ్ పెచ్చులూడి పడుతుండడం తో విద్యార్థినులు నిత్యం భయపడుతూ..ప్రాణాలను కాపాడుకుంటున్నారు. వారం క్రితం ఇదే హాస్టల్లో విద్యార్థిని తలపై ఫ్యాన్ పడి తీవ్ర గాయమైంది. ఇది మరువకముందే మరోసారి సీలింగ్ పెచ్చులూడి పడ్డాయి. వర్సిటీలోని పోతన ఉమెన్స్‌ హాస్టల్‌లోని ఓ గదిలో అర్ధరాత్రి వేల స్లాబ్‌ కుప్పకూలింది. అయితే ఆ సమయంలో గదిలో ఎవ్వరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అయితే ఈ ఘటపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు.

హాస్టల్‌లో ఉండాలంటే ప్రాణాలమీదికి వస్తున్నదని, ఎన్నిసార్లు వర్సిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా లాభం లేకుండా పోతున్నదని చెప్పారు. హాస్టల్‌ వార్డెన్‌ను నిలదీశారు. రాణిరుద్రమదేవి హాస్టల్‌ను పరిశీలించడానికి వచ్చిన రిజిస్ట్రార్‌ మల్లారెడ్డిని నిలదిశారు. హాస్టళ్లను ఎవరూ పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయనతో వాగ్వాదానికి దిగారు. రిజిస్ట్రార్‌ గోబ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు.