ఏపీ రైతులకు గుడ్ న్యూస్ తెలిపేందుకు ఏపీ సర్కార్ సిద్ధం..?

chandrababu

అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం..రాష్ట్ర ప్రజలకు వరుస గుడ్ న్యూస్ లు అందిస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వరుసగా నెరవేరుస్తూ వస్తుంది. ఇప్పటికే ఐదు కీలక హామీలను అమలు పరిచిన సర్కా ..ఇప్పుడు మరో హామీని ప్రజలకు అందించాలని చూస్తుంది. ప్రతి రైతుకు ఏడాదికి పెట్టుబడి సాయం కింద అందించే 20 వేల రూపాయల పథకంపై కీలక అప్‌డేట్ వచ్చేసింది. రైతులకు పెట్టుబడి సాయాన్ని కేంద్రం ఏటా 7500 రూపాయలు అందిస్తోంది. గత ప్రభుత్వం కూడా రైతు భరోసా కింద దీనికి మరో ఆరు వేలు కలిసి 13500 రూపాయలు ఇచ్చేది. అయితే దీన్ని 20వేలకు పెంచుతామని కూటమి పార్టీలు ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టాయి. ఇప్పుడు అధికారంలోకి వచ్చినందున ఈ హామీని అమలు పరిచే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

అర్హులు ఎంపికతోపాటు ఇతర సమస్యలు లేకుండా చర్యలు తీసుకునే దిశగా కసరత్తు చేస్తోంది. ఐదేళ్లుగా రైతు భరోసార పేరుతో ఉన్న పథకాన్ని అన్నదాత సుఖీభవగా మార్చేసిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఆ పథకాన్ని వీలైన త్వరగా రైతులకు అందివ్వాలని చూస్తోంది. ఈ సాయాన్ని గత ప్రభుత్వం మూడు విడతల్లో అందించేది… కానీ ఈసారి మాత్రం రెండు విడతల్లో ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దీని కోసం అర్హులైన రైతులను గుర్తించేందుకు ప్రత్యేక పోర్టల్‌ను ఏర్పాటు చేయనుంది. అందులో రైతుల వివరాలు పొందుపరిస్తే అర్హుల గుర్తింపు సులభతరం అవుతుందని ప్రభుత్వ ఆలోచన.